Mohan Babu: స్టూడెంట్స్ కిడ్నాప్ కేసులో మోహన్ బాబు..
ABN, Publish Date - Feb 03 , 2026 | 06:48 PM
మంచు మోహన్ బాబు (Mohan Babu) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mohan Babu: మంచు మోహన్ బాబు (Mohan Babu) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఆ ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ SFI లీడర్లు ధర్నా చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన మోహన్ బాబు వారిని తన బౌన్సర్ల చేత కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది.
కారులో వచ్చిన బౌన్సర్లు సినీ ఫక్కీలో విద్యార్థుల సంఘ నాయకులను ఎక్కించుకొని మోహన్ బాబు ఫామ్ హౌస్ లో బంధించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ బాబు ఫామ్ హౌస్ కి వెళ్లి విద్యార్థులను కాపాడి మోహన్ బాబు బౌన్సర్లను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఇప్పటివరకు మోహన్ బాబు స్పందించలేదు.
యూనివర్సిటీలలో అదనపు ఫీజులను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినా కూడా మోహన్ బాబు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల బాధను అర్ధం చేసుకున్న SFI లీడర్స్ ధర్నా చేపట్టి వారి ఆవేదనను యాజమాన్యానికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. అలాంటివారిని మోహన్ బాబు కిడ్నాప్ చేయించడం దారుణమని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ వివాదంపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.