Sowcar Janaki; జానకి నుంచి సావిత్రికి వెళ్ళిన పార్వతి పాత్ర!
ABN, Publish Date - Aug 21 , 2026 | 03:40 PM
మహానటి సావిత్రి (Savithri) కెరీర్ లో గొప్ప పేరు తెచ్చిపెట్టిన పాత్ర 'దేవదాసు'లోని సావిత్రి. నిజానికి ఆ పాత్రకు తొలుత జానకిని అనుకున్నారు.
మహానటి సావిత్రి (Savithri) కెరీర్ లో గొప్ప పేరు తెచ్చిపెట్టిన పాత్ర 'దేవదాసు'లోని సావిత్రి. నిజానికి ఆ పాత్రకు తొలుత జానకిని అనుకున్నారు. అలానే గుండమ్మ కథలో మేరీ పాత్ర కూడా జానకికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్రకూ మొదట భానుమతిని అనుకున్నారు. కానీ ఈ రెండు పాత్రలు చిత్రంగా సావిత్రి పోషించి, చిత్రసీమలో తనకంటూ ఓ గొప్ప ముద్రను వేసేలా చేశాయి. సావిత్రితో జానకికి ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. జానకి సినిమా రంగంలో నిలదొక్కుకునే రోజుల్లో జెమినీ గణేశన్ సహకారంతో పలు చిత్రాలలో అవకాశాలు పొందింది. ఆ చనువుతో ఒకసారి ఆయనతో కలిసి అద్దె ఇంటి కోసం వెతుకుంటుంటే... జెమినీ గణేశన్ ధౌంజెడ్ లైట్స్ లోని షఫీ మహమ్మద్ రోడ్డులోని మేడమీద పోర్షన్ ను చూపించారట. అదే మేడ కింద పోర్షన్ లో తొలిసారి గౌన్ వేసుకున్న సావిత్రిని తాను చూశానని జానకి చెబుతుండేవారు. జెమినీ గణేశన్ ద్వారానే నటి సావిత్రి పరిచయమైందని, ఆ తర్వాత ఆమె తనకు ఎంతో సన్నిహితురాలిగా మారిపోయిందని అంటుండేవారు జానకి.
తమ సినీ ప్రయాణం గురించి చెబుతూ, 'సావిత్రి గొప్ప చిత్రకారణి. తన రూపు రేఖా విలాసాలన్నీ ప్రతిబించేలా ఒక గొప్ప వర్ణ చిత్రాన్ని రచించి, తనకు తానుగా దాన్ని కాలి కింద నలిపి, ముక్కలు చేసిందేమో అనిపిస్తుంది నాకు. సావిత్రి 'దేవదాసు'లో చేసిన పార్వతి పాత్రకు మొదట నన్నే అనుకన్నారు. రిహార్సిల్స్ కూడా జరిగాయి. అయితే ఆ పాత్ర నుంచి నన్ను తప్పించారు. నిజంగా అది నా దురదృష్టమే. ఎందుకంటే 'ఓ దేవదా' పాట రిహార్సిల్స్ ఎంత బాగా వచ్చిందో చెప్పలేను. కారణం లేకుండా తీసేయడంతో చాలా బాధపడ్డాను. వేషం పోయినందుకు పది రోజులు ఏడ్చాను. ఒకవేళ నేను దేవదాసులో నటించి ఉంటే నా నట జీవితంల ఎలా ఉండేదో కదా అనిపిస్తుంది. అయితే నాకు సినిమా రంగంలో ఎవరి మీద ఎలాంటి కోపం ఉండేది కాదు. ఎందుకుంటే 'దేవదాసు' నుంచి నన్ను తప్పించినా, డి.ఎల్. నారాయణ గారు తీసిన 'కన్యాశుల్కం' సినిమాలో బుచ్చమ్మ పాత్ర నేను చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు.. గురజాడ స్మారక అవార్డునూ అందించింది. సావిత్రితో నేను కలిసి నటించిన మొదటి సినిమా 'ఆదర్శం'. ఆ తర్వాత 'కన్యాశుల్కం'లో తను మధురవాణిగా నటిస్తే, నేను బుచ్చమ్మగా చేశాను. 'చిరంజీవి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి' లాంటి మరికొన్ని సినిమాలు చేశాం. సావిత్రి నాతో ఎన్నో వ్యక్తిగత విషయాలు పంచుకునేది. ఆమె శ్రేయోభిలాషిగా, సన్నిహితురాలిగా ఎన్నో సలహాలు ఇచ్చేదాన్ని, ఒక్కోసారి మందలించే దానిని. వాటిని ఎంతో ఓపికగా విని చివరకు 'మీకున్నంత ధైర్యం, ఆత్మవిశ్వాసం నాలో లేవండీ' అనేది' అని జానకి చెప్పి వాపోతుండేది.