Mana Shankara Vara Prasad Gaaru: ఇక నుంచి నెగిటివ్ రివ్యూస్ పెడితే.. కేసులే
ABN, Publish Date - Jan 10 , 2026 | 05:50 PM
టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Gaaru) సినిమా .. నెగిటివ్ రివ్యూలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
Mana Shankara Vara Prasad Gaaru: టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Gaaru) సినిమా .. నెగిటివ్ రివ్యూలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. తప్పుడు రివ్యూలు, బాట్ రేటింగ్ లు లాంటివి లేకుండా కోర్టు సహకారంతో తొలి అడుగు వేసింది. గత కొంత కాలంగా కొన్ని నెగిటివ్ రివ్యూల వలన మంచి సినిమాలు కూడా పరాజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో వచ్చే రివ్యూస్ అండ్ రేటింగ్స్ వలన ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. రివ్యూ బాంబింగ్, ఫేక్ అకౌంట్లు, బాట్ డ్రైవన్ నెగిటివ్ క్యాంపెయిన్స్ వలన సినిమాను నాశనం చేస్తున్నారు.
బుక్ మై షోలో టికెట్స్ కొన్నా కొనకపోయినా కూడా రివ్యూ, రేటింగ్స్ ఇచ్చే వెసులుబాటు ఉండడంతో.. కొందరు ఒక గ్యాంగ్ లా ఏర్పడి నెగిటివ్ రేటింగ్స్ ఇస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటివన్నీ చిరంజీవి సినిమాకు చెల్లవు. ఈ సినిమాకు లీగల్ షీల్డ్ ని తీసుకొచ్చారు మేకర్స్. బుక్ మై షోలో మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు రివ్యూ, రేటింగ్ లు ఇవ్వడం కుదరదు. తమ సినిమాపై కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తారని కోర్టును ఆశ్రయించగా.. కోర్టు.. సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను ఆపాలని ఆదేశించింది. బుక్ మై షోలో కూడా రేటింగ్స్ ని నియంత్రించాలని తెలిపింది. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం యాప్ నిర్వాహకులు రివ్యూ, రేటింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేశారు.
ఇక నుంచి తమకు నచ్చిన సినిమాకు ఎక్కువ రేటింగ్స్ ఇచ్చి, నచ్చని సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇచ్చి వ్యాపారం చేయడం కుదరదు. దీనిపై షైన్ స్క్రీన్స్ మేకర్స్ ఒక ప్రకటన కూడా షేర్ చేశారు. 'డిజిటల్ మోసపూరిత చర్యల నుండి సినిమాను రక్షించడానికి ఈ కొత్త చొరవకు నాయకత్వం వహించినందుకు AiPlex మరియు BlockBigg లకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము' అంటూ చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఎవ్వరైనా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. తస్మాత్ జాగ్రత్త, లేకపోతే కేసులే అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇంకోపక్క టికెట్ రేట్ల హైక్ విషయంలో తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెల్సిందే. మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జనవరి 8 నే మెమో రెడీ అయ్యింది. కానీ, దాన్ని జనవరి 10 న రిలీజ్ చేశారు. ఇక మరోపక్క టికెట్ ధరలను పెంచడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్.. కోర్టులో కేసు వేశాడు. దీంతో కోర్టు హౌస్ మోషన్ లో కేసును విచారించడానికి నిరాకరించింది. కోర్టు సెలవులు అయ్యేవరకు ఆగాలని, ఆ తర్వాతే వాదోపవాదాలు వింటామని తెలిపింది. జనవరి 19 న ఈ కేసు విచారణకు రానుంది.