సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: చిరును వెంటాడుతున్న జన నాయకుడు..

ABN, Publish Date - Jan 23 , 2026 | 04:38 PM

తమిళ స్టార్ విజయ్ (Vijay) హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన 'జన నాయగన్ (Jana Nayagan)' సినిమా జనవరి 9న రిలీజ్ కావాలి. ఈ సినిమాను తెలుగులో 'జన నాయకుడు' పేరుతోనూ అనువదించారు.

Chiranjeevi

Chiranjeevi: తమిళ స్టార్ విజయ్ (Vijay) హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన 'జన నాయగన్ (Jana Nayagan)' సినిమా జనవరి 9న రిలీజ్ కావాలి. ఈ సినిమాను తెలుగులో 'జన నాయకుడు' పేరుతోనూ అనువదించారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ జాప్యం, ఈ మూవీపై సెన్సార్ బోర్డ్ వారే కోర్టుకు వెళ్ళడం తదితర కారణాల వల్ల 'జన నాయగన్' అనుకున్న సమయానికి రిలీజ్ కాలేక పోయింది. ఇప్పటికీ ఆ సినిమాపై తీర్పు మద్రాస్ హై కోర్టులోనే రిజర్వ్ లో ఉంది... మరి అదెప్పుడు వెలుగు చూస్తుందో అప్పుడే చిరంజీవి (Chiranjeevi) తాజా చిత్రం షూటింగ్ సజావుగా సాగడానికి వీలవుతుందట. ఆ సినిమాకు ఈ చిత్రానికి సంబంధమేంటి అంటే 'జన నాయగన్' ను నిర్మించిన కేవీయన్ ప్రొడక్షన్స్ సంస్థనే చిరంజీవి- డైరెక్టర్ బాబీ (Bobby) కాంబోలో సినిమా తీయనుంది. అదన్న మాట అసలు సంగతి... అందువల్ల 'జన నాయగన్' జనం ముందుకు వచ్చే దాకా, చిరు-బాబీ సినిమా సజావుగా పట్టాలెక్కలేదు.

కేవీయన్ ప్రొడక్షన్స్ అధినేత కె.వెంకట నారాయణ కర్ణాటకలో ప్రముఖ పంపిణీ దారుడు, ఆయన నిర్మించిన 'సఖత్, బై టూ లవ్' అనే రెండు కన్నడ చిత్రాలు రిలీజయ్యాయి. ఆ తరువాత ఆయన దృష్టి పాన్ ఇండియా మూవీస్ వైపు మళ్ళింది. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ తో 'జన నాయగన్' నిర్మించారు. తరువాత కన్నడ స్టార్ యశ్ తో కలసి 'టాక్సిక్' సినిమాను తెరకెక్కించారు. మరో కన్నడ హీరో ధ్రువ్ సర్జా, సంజయ్ దత్ కాంబోలో భారీగా 'కేడీ' అనే చిత్రాన్నీ నిర్మిస్తున్నారు. ఇలా ఈ మూడు చిత్రాలను పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు కె.వెంకటనారాయణ... అయితే ఈ మూడు చిత్రాల్లో ముందుగా రిలీజ్ కావలసిన 'జన నాయగన్'కే సెన్సార్ చిక్కులు ఎదురై, కోర్టులో చిక్కింది. వెంకట నారాయణ లెక్క ప్రకారం జనవరిలో 'జన నాయగన్', మార్చిలో 'టాక్సిక్', మే లో 'కేడీ' విడుదల కావాలి... మొదటి సినిమానే ఇంకా వెలుగు చూడలేదు. దాంతో 'టాక్సిక్'పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేవీయన్ ప్రొడక్షన్స్ అధినేత కె.వెంకటనారాయణ మూడు భారీ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అందులో ముందుగా రావలసిన 'జన నాయకుడు' సెన్సార్ సమస్యతో కోర్టులో ఉంది. తరువాతి సినిమా 'టాక్సిక్', ఆ తరువాత 'కేడీ' రావాలి. అన్నిటా భారీ మొత్తాలు పెట్టడం వల్ల, అవి ఇంకా వెలుగు చూడని కారణంగా కొత్త సినిమాను ఆరంభించేందుకు ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ ఎదురవుతోంది. 'జన నాయకుడు' రిలీజ్ అయితేనే వెంకట నారాయణ ఊపిరి పీల్చుకోగలరు. పైగా ఆ సినిమా డిలే కావడం వల్ల ఓటీటీ రేటులోనూ భారీ తేడా పడనుందట... ఇలా ఇబ్బందుల్లో ఉన్న వెంకట నారాయణ వెంటనే చిరంజీవి, బాబీ సినిమాను పట్టాలెక్కించ లేకపోతున్నారు... ఈ మూవీ సజావుగా సెట్స్ లో సాగాలన్నా ముందుగా 'జన నాయకుడు' వెలుగు చూడాల్సిందే. మరి విజయ్ సినిమా ఎప్పుడు వస్తుందో, చిరంజీవి చిత్రం ఎలా మొదలవుతుందో చూడాలి..

Updated Date - Jan 23 , 2026 | 04:38 PM