ఆహ్వానం రాలేదు.. వస్తే ఫార్వర్డ్ చేస్తా.. కలిసి వెళ్దాం
ABN, Publish Date - Feb 09 , 2026 | 04:58 PM
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పెళ్లిపై కొన్నాళ్ళగా చర్చ నడుస్తోంది. త్వరలోనే పెళ్ళని, రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై కుటుంబ సభ్యులు, విజయ్ ఎక్కడ స్పందించలేదు
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పెళ్లిపై కొన్నాళ్ళగా చర్చ నడుస్తోంది. త్వరలోనే పెళ్ళని, రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై కుటుంబ సభ్యులు, విజయ్ ఎక్కడ స్పందించలేదు. ఈ నెల 26న విజయ్- రష్మికల వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయ్ కు స్నేహితుడైన తరుణ్ భాస్కర్ కు (Tharun Bhascker) విజయ్ పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ‘త్వరలో విజయ్ వివాహం అని తెలిసింది. మీరు వెళుతున్నారా?’ అని అడగ్గా.. ‘నాకు ఆహ్వానం అందలేదు. ఒకవేళ నాకు ఆహ్వానం వస్తే మీకు వాట్సాప్‌లో పంపిస్తా. కలిసి వెళదాం’ అని తరుణ్ భాస్కర్ తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’ (GaayaPadda Simham) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమాధానమిచ్చారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘గాయపడ్డ సింహం’లో తరుణ్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్క కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
సినిమాల గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం హీరోగా మూడు ప్రాజెక్టులు అంగీకరించా. వాటిలోని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఇటీవల విడుదలైంది. రెండో సినిమా గాయపడ్డ సింహం. మరో సినిమా రాబోతోంది. దర్శకుడిగా ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ తెరకెక్కిస్తున్నా. అక్టోబరు లేదా నవంబరులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఓటీటీ కోసం ఓ ప్రాజెక్టు చేస్తున్నా. వెంకటేశ్‌తో చేయాలనుకున్న మూవీ స్క్రిప్టు దశలో ఉంది. అది కాకుండ వేరే కథ ఒకటి రాస్తున్నా’అని తెలిపారు.