సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thammareddy Bharadwaja: కాస్టింగ్‌ కౌచ్.. చిన్మయి నిజమే చెప్పింది! ఏటా 40 సినిమాలు.. అందుకే తీస్తారు

ABN, Publish Date - Jan 30 , 2026 | 07:48 AM

చిన్మయి చెప్పింది నిజమే అని ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్‌ కౌచ్ ఉంది అంటూ ప్ర‌ముఖ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Thammareddy Bharadwaja

తెలుగు పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్ (Casting Couch)లేదని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అనడం.. దానికి బదులుగా ఇండస్ట్రీలో ఈ సమస్య ఎక్కువగా ఉందని గాయని చిన్మయి (Chinmayi Sripada) పేర్కొనడం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశం సోష‌ల్ మీడియాను ఊపేస్తుంది. అటు చిరు కామెంట్స్‌పై ఆయ‌న అభిమానులు మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా ఇటు చిన్మ‌యి కామెంట్ల‌పై కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) స్పందించారు.

ఆయన చిత్రజ్యోతితో మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయనేది వాస్తవమే. అయితే ఇది అందరూ చేస్తున్నారని కాదు. ఇది తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభం నుంచి ఉన్న సమస్యే. పరిశ్రమలో ఏడాదికి దాదాపు 250 చిత్రాలు నిర్మితమవుతుంటాయి. అందులో ఓ 30 లేదా 40 సినిమాలు మాత్రం మహిళలను ఇలా వాడుకోవడానికి తీస్తున్నవే. ఇది కాదనలేని వాస్తవం. కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చిన్మయి చెప్పింది నిజమే. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే ధోరణి పరిశ్రమలోని ఒకరిద్దరు పెద్దల్లో ఉంది’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 08:02 AM