సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘OG 2’ ఆల్బమ్ నిరంజన్‌కు అంకితం: థమన్ ఎమోషనల్

ABN, Publish Date - Jul 08 , 2026 | 05:55 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయబోయే ‘ఓజీ 2’ చిత్రం ఆల్బమ్‌ని, ఆయన అభిమాని అయినటువంటి నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించారు సంగీత దర్శకుడు థమన్.

Thaman Post on Niranjan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan) తో చేయబోయే ‘ఓజీ 2’ (OG 2) చిత్రం ఆల్బమ్‌ని, ఆయన అభిమాని అయినటువంటి నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించారు సంగీత దర్శకుడు థమన్ (S Thaman). జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (Niranjan) మరణం ఇటు జనసైనికుల్లో, అటు మెగా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. చిన్నప్పటి నుంచి జెనెటిక్ సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ .. తన చివరికోరిక తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ని కలవడమే అని చెప్పగా, ఇటీవల పవన్ కళ్యాణ్ వెళ్లి కలిసిన విషయం తెలిసిందే.


నిరంజన్‌ని కలవడానికి వెళ్లినప్పుడు.. అతనికి పవన్ కళ్యాణ్ ఓ ప్రామిస్ చేశారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’ సీక్వెల్ ‘ఓజీ 2’కు నువ్వే స్పెషల్ గెస్ట్ అని, కలిసి ఆ సినిమా చూద్దామని ఆ బాబుకు పవన్ ప్రామిస్ చేశారు. నిరంజన్ తన కల నెరవేరకుండానే ఈ లోకం విడిచివెళ్లిపోయారు. ఈ వార్త తెలిసిన పవన్ కళ్యాణ్ కూడా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆ కుర్రాడికి మాట ఇచ్చారు కాబట్టి.. ‘ఓజీ 2’ ఆల్బమ్ మొత్తం నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లుగా తాజాగా థమన్ తన ఇన్‌స్టా వేదికగా తెలిపారు. థమన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అంతా ఫిదా అవుతున్నారు.


నిరంజన్ మృతి పట్ల చింతించిన థమన్.. ‘నీ ఆత్మకి శాంతి చేకూరాలి నిరంజన్.. మన లీడర్ చెప్పినట్లుగా మా ఆల్బమ్‌ని నీకు అంకితం చేస్తున్నాము..’ అని పవన్ కళ్యాణ్, నిరంజన్ సెల్ఫీ ఫొటోను థమన్ షేర్ చేశారు. ప్రస్తుతం థమన్ చేసిన ఈ పోస్ట్.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘ఇది మంచి నిర్ణయం అన్నా’.. అంటూ మెగా అభిమానులు థమన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లుగా వారి కామెంట్స్‌లో పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

భాగ్యరాజ్‌ను ఐస్‌ బాక్సులో చూడలేకే.. ఊర్వశి షాకింగ్ కామెంట్స్

VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...

‘రామాయణ’.. అంత‌ రేటు తగ్గడానికి కారణం ఏమిటి?

Updated Date - Jul 08 , 2026 | 06:22 PM