సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిరంజీవి చేతుల మీదుగా టీఎఫ్‌జేఏ డైరీ ఆవిష్కరణ

ABN, Publish Date - Mar 28 , 2026 | 06:04 PM

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) నూతన  డైరీని మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) నూతన  డైరీని మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు. 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ, ఇన్సూరెన్స్, ఐడీ కార్డులను చిరంజీవి స్వగృహంలో విడుదల చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తూ రూ.5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.

ప్రతి ఏడాది  అసోసియేషన్ సభ్యులకు హెల్త్  ఇన్సూరెన్స్  అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది. ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టారు.

ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 06:04 PM