సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమ్మారెడ్డి భరద్వాజ:  ఒకప్పుడు దర్శకుల సంఘం.. ఇండస్ట్రీని లీడ్ చేసేది

ABN, Publish Date - Mar 09 , 2026 | 09:43 AM

తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు (TDFA Elections) ఆదివారం జరిగాయి. ఇందులో సాయి రాజేష్ (Sai rajesh) - వీఎన్ ఆదిత్య (V N Aditya) ఎంపవర్ ప్యానల్ ఘన విజయం సాధించింది.

తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు (TDFA Elections) ఆదివారం జరిగాయి. ఇందులో సాయి రాజేష్(Sai rajesh) - వీఎన్ ఆదిత్య (V N Aditya) ఎంపవర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. దర్శకుల సంఘ అధ్యక్షుడిగా వి.ఎన్. ఆదిత్య విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా వి. సముద్ర, ఎ. ప్రభు, ఎస్.వి. భాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. నిజానికి ఉపాధ్యక్షుడి పదవికి ఇద్దరు అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఎస్.వి. భాస్కర్ రెడ్డి, ఎ. ప్రభుకు సమానంగా ఓట్లు రావడంతో ముగ్గురిని ఆ పదవికి తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పి.వి. రామారావు, ట్రెజరర్ గా సాయి రాజేశ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో ఇదే హైయెస్ట్ మెజారిటీ కావడం విశేషం.

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాల వేసి దర్శకుల సంఘం సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 'ఒకప్పుడు దర్శకుల సంఘం ఇండస్ట్రీని లీడ్ చేసేది. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వి.ఎన్. ఆదిత్య సారథ్యంలోని కమిటీ దర్శకుల సంఘం సంక్షేమానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. గెలిచిన వాళ్లే కాదు ఓడిన వాళ్లు కూడా మనవాళ్లే.  అందరు కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతున్నా' అన్నారు. (Directors Association Elections)

నూతన అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ 'గత రెండేళ్లు దర్శకుల సంఘంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. మా ప్యానెల్లో 18 మంది పోటీ చేస్తే 16 మంది గెలిచారు. అంటే మాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ గెలుపునకు సాయి రాజేశ్ ఎంతో కృషి చేశారు. అలాగే గతంలో మిగతా ప్యానెల్ ఉన్న వారు కూడా ఈసారి మా ప్యానెల్ తరపున పోటీ చేశారు. ఈ ప్యానెల్ గెలవాలి అని పెద్ద మనసుతో సముద్ర గారు, రాంప్రసాద్ గారు పోటీ నుంచి తప్పుకుని మా ప్యానెల్ తరపున నిలబడ్డారు. సందీప్ వంగా, అనిల్ రావిపూడి.. ఇలా ఎంతోమంది బిజీగా ఉన్న దర్శకులు వచ్చి ఓటేశారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. అసోసియేషన్ సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణంలో సహాయం చేస్తాం' అన్నారు. 

దర్శకుల సంఘం ట్రెజరర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ 'దర్శకుల సంఘంలో ఎన్నడూ లేనంత సంక్షేమ కార్యక్రమాలు గతేడాది మేము చేపట్టాం. మేము ఇచ్చిన 8 వాగ్ధానాలు మమ్మల్ని గెలిపించాయని నమ్ముతున్నాం. మూల ధనం ముట్టకుండా హీరోలు, దర్శకుల నుంచి విరాళాలు సేకరించి సంఘ సభ్యులందరికీ రెండేళ్ల పాటు ఇన్సురెన్స్ చెల్లించాం. ఇప్పుడు శాశ్వతంగా అందరికీ ఇన్సూరెన్స్ చెల్లించే బాధ్యత తీసుకుంటాం. మిడ్ డే మీల్స్ కూడా కొనసాగిస్తాం. మా గురువుగారు వి.ఎన్. ఆదిత్య అధ్యక్షుడిగా ఎన్నికవడం సంతోషంగా ఉంది' అన్నారు  

'నూతన కమిటీ మీదపై ఎంతో నమ్మకం పెట్టి సభ్యులను గెలిపించారు. వారి నమ్మకాన్ని కాపాడుకునేలా కొత్త బాడీ పనిచేస్తుందని నమ్ముతున్నాను'  అని  ఎన్. శంకర్  అన్నారు.


 

Updated Date - Mar 09 , 2026 | 07:36 PM