సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

National Awards: జాతీయ పురస్కారాలు అందుకున్న సుకుమార్, నాగ్ అశ్విన్, నిహారిక

ABN, Publish Date - Sep 22 , 2026 | 07:52 PM

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని కేవాడియాలో ఘనంగా జరిగింది.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (National Awards)n ప్రదానోత్సవం గుజరాత్‌లోని కేవాడియాలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు సినీ ప్రముఖులు. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్‌’ (Pushpa 2) చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) విభాగంలో సుకుమార్‌ జాతీయ అవార్డు అందుకున్నారు.

అలాగే ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నిర్మాత నిహారిక కొణిదెల అవార్డును స్వీకరించారు. ‘కల్కి 2898 ఏడీ’, ‘35.. చిన్న కథ కాదు’, ‘లక్కీ భాస్కర్‌’ వంటి తెలుగు చిత్రాలు కూడా వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నాయి. దిగ్గజ నటుడు అనంత నాగ్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు.

ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370,  ఉత్తమ నటిగా యామీ గౌతమ్ అవార్డ్ అందుకున్నారు.  ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్ముట్టి (మలయాళ చిత్రం: భ్రమయుగం), చందు ఛాంపియన్  చిత్రానికిగాను కార్తీక్ ఆర్యన్‌ అవార్డులు స్వీకరించారు. 

ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి -తమిళ చిత్రం: అమరన్ కు, స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సినిమాకు గాను ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రణదీప్ హూడా పురస్కారాలు అందుకున్నారు. 

Updated Date - Sep 22 , 2026 | 08:40 PM