సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగు సినీ, టీవీ మేకప్ యూనియన్ ఎన్నికలు.. అధ్యక్షుడిగా సాయి కుమార్ విజయం

ABN, Publish Date - Sep 21 , 2026 | 01:01 PM

తెలుగు సినీ అండ్ టీవీ మేకప్, హెయిర్ స్టైలిస్ట్స్ యూనియన్ ఎన్నికల్లో సాయి కుమార్ 156 ఓట్ల మెజార్టీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా రెడ్డి సురేష్ గెలుపొందారు.

TELUGU CINE & TV MAKEUP ARTISTS & HAIR STYLISTS UNION

శ్రీకృష్ణనగర్‌లోని తెలుగు సినీ అండ్ టీవీ, మేకప్, హెయిర్ స్టైలిస్ట్స్ యూనియన్ (TELUGU CINE & TV MAKEUP ARTISTS & HAIR STYLISTS UNION)కి ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా సాయి కుమార్ 156ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా పోటీలో ఉన్న రెడ్డి సురేష్ 89ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా కె.శివానందం, సంయుక్త కార్యదర్శిగా జి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరిగా సిహెచ్. మన్మదరావు గెలుపొందారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లంకి శ్రీనివాస కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా గెలుపొందిన నాయకులు మాట్లాడుతూ, యూనియన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అందేలా చూస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 01:01 PM