సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తిరుమలలో హీరోయిన్లు శ్రీలీల, గౌరీ ప్రియ.. సుప్రభాత సేవలో ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Nov 13 , 2026 | 12:58 PM

హీరోయిన్లు శ్రీలీల, గౌరీ ప్రియ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ప్రముఖ తెలుగు కథానాయికలు శ్రీలీల (Sreeleela), గౌరీ ప్రియ (Gouri Priya) శుక్రవారం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరిద్దరూ తెల్లవారుజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

సుప్రభాత సేవ అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ అధికారులు వీరిని రంగనాయకుల మండపానికి తీసుకెళ్లారు. అక్కడ వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి దర్శనం కోసంఅచ్చ తెలుగు సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో వచ్చిన శ్రీలీల, గౌరీ ప్రియలను చూసేందుకు ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తి చూపించారు. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. ప్రస్తుతం వీరి తిరుమల పర్యటనకు సంబంధించిన వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Nov 13 , 2026 | 12:58 PM