బెంజ్ కారు కొన్న నటి హేమ.. రేటు తెలిస్తే పిచ్చెక్కిపోతుంది అంతే
ABN, Publish Date - Jul 14 , 2026 | 09:52 PM
టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ(Hema) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై తనదైన నటనతో, కామెడీ టైమింగ్‌తో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె..
టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ(Hema) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై తనదైన నటనతో, కామెడీ టైమింగ్‌తో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె.. ఈ మధ్యకాలంలో ఎన్నో వివాదాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలోనే హేమ తాజాగా సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌కు చెందిన ఒక విలాసవంతమైన కారును సొంతం చేసుకుంది. సరికొత్త బెంజ్ కారుతో ఆమె దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.
హేమ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మోడల్ ధర అక్షరాలా రూ. 1.65 కోట్లు ఉంటుందని సమాచారం. టాప్-ఎండ్ ఫీచర్స్, అత్యాధునిక సేఫ్టీ సిస్టమ్స్, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కూడిన ఈ కారు రేటు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంత రేటు పెట్టి హేమ కారు కొనడంతో.. చాలామంది వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు హేమకు ఇంత మనీ ఎక్కడ నుంచి వస్తున్నాయో అంటూ పెదవి విరుస్తున్నారు.
ఇక రెండేళ్ల క్రితం హేమ బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెల్సిందే. ఈ డ్రగ్స్ కేసు వివాదం ముదరడంతో మరియు బ్లడ్ రిపోర్ట్స్‌లో పాజిటివ్ అని తేలడంతో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆ తరువాత ఆమె తప్పేమీ లేదు అని తేలడంతో హేమ ఈ కేసు నుంచి బయటపడింది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఆమె బిజీగా మారింది.