సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినీ నటి అనితకు సైబర్ వల.. రూ. 4.14 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ABN, Publish Date - Nov 18 , 2026 | 03:25 PM

రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న సినీ నటి గోగినేని అనిత (Gogineni Anitha) విమాన టికెట్ బుకింగ్ పేరిట భారీ సైబర్ మోసానికి గురయ్యింది.

Gogineni Anitha

రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న సినీ నటి గోగినేని అనిత (Gogineni Anitha) విమాన టికెట్ బుకింగ్ పేరిట భారీ సైబర్ మోసానికి గురయ్యింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో నివసిస్తున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు గాను, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆమె ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ల కోసం సెర్చ్ చేయగా లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే కంపెనీ కనెక్ట్ అయ్యింది.


లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న రాజేష్ అనే వ్యక్తి నటి అనితను సంప్రదించాడు. అమెరికాకు బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేస్తామని నమ్మించి, టికెట్ ధర రూ. 4,14,180 అవుతుందని చెప్పాడు. టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి డెబిట్ కార్డు వివరాలు అవసరమని అడగడంతో, అతని మాటలను నమ్మిన అనిత తన కార్డు వివరాలతో పాటు ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ని కూడా షేర్ చేసింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి క్లియర్ ట్రిప్ పేరిట 4 లక్షలు డెబిట్ అయ్యాయి. అయితే డబ్బులు కట్ అయినప్పటికీ, ఎంతసేపటికీ విమాన టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ వివరాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన అనిత ఏజెంట్‌ను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే మోసపోయానని గ్రహించిన ఆమె, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


అనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో ఆమె నటించారు. ఛత్రపతి సినిమాలో సూరీడు.. ఓ సూరీడు అంటూ కొడుకు కోసం పరితపించే కళ్లు లేని తల్లిగా ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమానే కాకుండా నువ్వే నువ్వే, మన్మధుడు, ఉయ్యాల జంపాల లాంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.

Updated Date - Nov 18 , 2026 | 03:31 PM