సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Gaddar awards 2025: గద్దర్‌ అవార్డులు.. ఈసారి మరింత ప్రత్యేకం..

ABN, Publish Date - Jan 20 , 2026 | 11:15 AM

గతేడాది తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసింది. సినీరంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారాలను అందించారు.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar awards 2025)కు  ప్రకటన వచ్చింది. ఈ మేరకు తెలంగాణ  ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసింది. సినీరంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారాలను అందించారు. ఈ ఏడాది కూడా గద్దర్‌ అవార్డు దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిర్మించిన చిత్రాలకు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ సారి 17 విభాగాల్లో గద్దర్‌ అవార్డులు ఇవ్వబోతున్నారు. కొత్త అవార్డులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఉత్తమ సామాజిక సందేశ చిత్రంకు ప్రత్యేక అవార్డు, మరో ప్రత్యేక విభాగంలో డా. సి. నారాయణరెడ్డి అవార్డు ఇవ్వనున్నామని, ఈ నెల 21 నుంచి 31 వరకు అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని  ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) తెలిపింది.

Updated Date - Jan 20 , 2026 | 11:35 AM