సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గద్దర్ అవార్డ్స్ వేడుకలో తళుక్కుమన్న తారాలోకం

ABN, Publish Date - Mar 20 , 2026 | 01:52 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ సినీ పురస్కారాల్ని ఏర్పాటు చేసి రెండేళ్లుగా ఘనంగా ఈ వేడుకను నిర్వహిస్తోంది. గతంలో మాదిరిగానే ఉగాది పర్వదినం రోజునే ఈ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ సినీ పురస్కారాల్ని ఏర్పాటు చేసి రెండేళ్లుగా ఘనంగా ఈ వేడుకను నిర్వహిస్తోంది. గతంలో మాదిరిగానే ఉగాది పర్వదినం రోజునే ఈ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. రాష్ట్ర విభజన, తదితర కారణాలతో పద్నాలుగేళ్లపాటు నిలిచిపోయిన అవార్డు వేడుకకు మళ్లీ  పునర్వైభవం వచ్చింది. 


సినిమా రంగంలో ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ సినీ పురస్కారాల్ని ప్రదానం చేస్తోంది. 2025కు గానూ తెలుగు సంవత్సరాది రోజున పురస్కారాల్ని అందజేశారు.


హైటెక్స్  కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా సందడి చేశారు. ఆటపాటలతో వేడుక సందడిగా సాగింది.


జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుక ఆద్యంతం సందడిగా సాగింది. అలనాటి తారలు సావిత్రి, శ్రీదేవి, సౌందర్య తదితరుల్ని గుర్తు చేస్తూ... కథానాయిక నిధి అగర్వాల్‌ వేదికపై చేసిన నృత్యాలు అలరించాయి.  

తెలుగుసినీ తారలు, పురస్కార గ్రహీతలతోపాటు హిందీ నుంచి వచ్చిన మాధురీ దీక్షిత్, జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ స్పెషల్ ఎట్ట్రక్షన్ గా నిలిచారు.  


మంగ్లీ ఆటాపాట, ‘నాగబంధం’లోని నమోరే పాటకు నభా నటేశ్ నృత్యాలు, దేవిశ్రీ ప్రసాద్‌ హుషారెత్తించేలా పాడిన పాటలు,  సంగీత ప్రదర్శనలు వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Updated Date - Mar 20 , 2026 | 02:53 PM