జ్యోతి ప్రజ్వలనతో మొదలైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్..
ABN, Publish Date - Mar 19 , 2026 | 07:55 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్సు వేడుకకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ వేదికైంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్సు (Gaddar Film Awards) వేడుకకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ వేదికైంది. గతేడాది ప్రారంభించిన ఈ వేడుక రెండో ఏడాది కూడా వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కారించుకుని 2025వ సంవత్సరానికి గానూ సినిమా ఇండస్ట్రీలో విశేష ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డుల సావనీర్‌ను విడుదల చేశారు.
మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షునిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ ఛైర్మన్ కాగా, పుస్తకాలు- సమీక్షల పరిశీలనకు తనికెళ్ళ భరణి ఛైర్మన్ గా ఉన్నారు... ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షునిగా వ్యవహరించారు. వీరితోపాటు జ్యూరీ సభ్యులను తెలంగాణ ప్రభుత్వం జ్ఞాపిక, ప్రశంస పత్రం, నగదుతో సత్కరించింది.
ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినిమా హబ్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది' అని అన్నారు.
అనంతరం ఫస్ట్ సెగ్మెంట్ అవార్డ్ లను ప్రదానం చేశారు. గ్రహీతలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జ్ఞాపికతోపాటు నగదు బహుమతిని అందజేశారు.
పురస్కార గ్రహీతలు..
ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం - తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (డెబ్యూ) - లిటిల్ హార్ట్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం -సంక్రాంతికి వస్తున్నాం!
ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం - కోర్ట్
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ - మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం - అనగనగా
ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ కె.రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు - అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని - సాహితీ (కన్నప్ప)
ఉత్తమ హాస్య నటుడు - కృష్ణ తేజ్ రెడ్డి (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు - మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - సందీప్ (ఛాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - తోట తరణి (ఛాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - వై.గోవిందరాజు (అఖండ 2)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ సొనావాని, అజయ్‌కుమార్ నంబాల (ఛాంపియన్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ - పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
రోషన్ మేక (ఛాంపియన్)
అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు)
బెస్ట్ బుక్ - శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు)
ఉత్తమ సినీ విమర్శకుడు - హెచ్. రమేశ్‌బాబు
ఉత్తమ షార్ట్స్ ఫిల్మ్స్
వనజీవి రామయ్య - భూసం రవీంద్రనాథ్
మౌనమే నీ భాష - రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్ హనుకర్
సైబర్ స్లేవరీ - కె. నీలిమ
డిప్లొమా ఆఫ్ మెరిట్: తల్లిదండ్రుల ఆత్మ గౌరవం (కనపర్తి హనుమండ్లు)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్
యూనిటి (మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్) - చిరందాస్ శ్రీకాంత్
ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం - పొన్నం రవిచంద్ర
మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు - బాలబ్రహ్మచారి పూసపాటి