సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘భోగి’ ఈవెంట్ వాయిదా.. ఆ చిక్కే కారణమా

ABN, Publish Date - Nov 07 , 2026 | 08:58 PM

శర్వానంద్‌ కథానాయకుడిగా, సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘భోగి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. దీని వెనుకున్న కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

శర్వానంద్‌ (Sharwanand) కథానాయకుడిగా, సంపత్‌ నంది (Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోగి’ (Bhogi). అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కెకె రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. నవంబరు 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం శనివారం ప్రీ రిలీజ్ వేడుకతో పాటు ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే తాజాగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు సంపత్ నంది ప్రకటించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముందుగా నిర్ణయించిన తేదీకి ఈవెంట్ నిర్వహించడం సాధ్యం కావడం లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘భోగి’ ప్రీ రిలీజ్ వేడుక కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తమకు తెలుసని పేర్కొన్న ఆయన.. ఈవెంట్ వాయిదా పడటంతో నిరాశపరిచినందుకు క్షమాపణలు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 12న సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో కొత్త ఈవెంట్ తేదీ ఎప్పుడు ప్రకటిస్తారనే ఆసక్తి నెలకొంది. 

సెన్సార్ సమస్యే కారణమా? 

ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది.  సెన్సార్ చిక్కే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాకి కారణమని తెలిసింది.  సినిమాలో హింస ఎక్కువగా ఉండటం వల్ల  సెన్సార్ బోర్డు కొన్ని మార్పులు సూచించిందని తెలిసింది. అందుకు చిత్ర బృందం అంగీకరించిందా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం రివైజింగ్ కమిటీ దగ్గర సినిమా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా 12న వస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. 

Updated Date - Nov 07 , 2026 | 09:17 PM