సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అక్టోబర్ 2న తత్వం

ABN, Publish Date - Sep 21 , 2026 | 01:38 PM

అర్జున్ కోలా దర్శకత్వం వహించిన 'తత్వం' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.

Tathvam Movie

మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సినిమా 'తత్వం'. దినేష్‌ తేజ్‌, దష్విక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోలా దర్శకుడు. ఈ మూవీని వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ కు చక్కని ఆదరణ లభించింది. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియచేస్తూ, 'మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్ ఇది. సంగీతానికి ఎంతో స్కోప్‌ ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అందరికీ నచ్చింది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ చక్కగా కుదిరాయి. అందరూ ఈ సినిమా కోసం ఎంతో సపొర్ట్‌ చేశారు. అర్జున్‌ కోలా ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు. అనుకున్న కథను మించి దర్శకుడు తెరకెక్కించాడు. అందరికి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నాం' అన్నారు.


దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ 'సంగీతానికి ప్రాధ్యాన్యమున్న చిత్రమిది. చేతన్‌ భరద్వాజ్‌ కథకు తగ్గట్టుగా అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడు. మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. కథ తప్పకుండా అందరికి ఎంగేజింగ్‌గా ఉంటుంది. వంశీ గారి 'అన్వేషణ' తరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా. ఇందులో ఉండే ట్విస్ట్స్ ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటాయి' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు

Updated Date - Sep 21 , 2026 | 01:55 PM