సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tarak Ponnappa: చరణ్ ఫ్యాన్స్ నన్ను బూతులు తిడుతున్నారు..

ABN, Publish Date - Aug 05 , 2026 | 03:39 PM

ఒక సినిమాపై తెలుగువారికి ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. కొంతమంది ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి అందులో నటులు నటిస్తున్నారు అనేది కూడా మర్చిపోతారు.

Tarak Ponnappa

ఒక సినిమాపై తెలుగువారికి ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. కొంతమంది ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి అందులో నటులు నటిస్తున్నారు అనేది కూడా మర్చిపోతారు. హీరోలను కొట్టినవారిని, హీరోయిన్లను బలవంతం చేసినవారిని ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తారు. బయట కూడా అతను విలన్ అనే అనుకుంటారు. ఎక్కడైనా కనిపిస్తే మా హీరోని ఎందుకు కొట్టావ్.. అని అడిగేస్తారు. తాజాగా ఇలాంటి పరిస్థితినే తాను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చాడు నటుడు తారక్ పొన్నప్ప(Tarak Ponnappa). పుష్ప సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్ పొన్నప్ప , ఆ తర్వాత వరుస సినిమాల్లో ప్రతినాయకుడిగా, కీలక పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.


ప్రస్తుతం ఆయన నటించిన అనకాపల్లి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఆయనను 'మా రామ్ చరణ్ కాలు ఎందుకు విరగ్గొట్టారు? అని ప్రశ్నించగా, తారక్ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. పెద్ది సినిమాలో తాను రామ్ చరణ్ కాలు విరగ్గొట్టే సీన్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో చరణ్ అభిమానులు తనను విపరీతంగా బూతులు తిడుతున్నారని తారక్ పొన్నప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. అది కేవలం సినిమాలో ఒక పాత్ర మాత్రమేనని, డైరెక్టర్ చెప్పినట్లు నటించడం వరకే తన పని అని వివరించాడు. కానీ అభిమానులు ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా సోషల్ మీడియా వేదికగా తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపాడు


అంతేకాకుండా బయట కనిపిస్తే కొట్టేస్తామని, అది చేస్తాం.. ఇది చేస్తాం అని కూడా అంటుంటారు. కొన్ని మెసేజ్ లను డిలీట్ కూడా చేశాను. అభిమానం అలా ఉంటుంది అని తారక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తారక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరణ్ ఫ్యాన్స్ ఇలా చేయడంపై పలువురు మండిపడుతున్నారు. పాత్రని పాత్రలా చూడాలి. సినిమాను సినిమాలా చూడాలి. ఇలా వ్యక్తిగత దూషణ చేయకూడదు అని కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 03:41 PM