సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిరంజీవి సినిమాలకే డ్యాన్స్ చేస్తారా? అంటూ ‘తార’ మాస్టర్‌పై అలిగిన అగ్ర హీరో!

ABN, Publish Date - Jun 20 , 2026 | 04:37 PM

‘వేరే హీరో సినిమాలకే వర్క్ చేస్తారా? మీరు నాకు డేట్స్ ఇవ్వనంటారా?.. నేను వేరే కొత్త మాస్టర్స్‌ని పరిచయం చేస్తానంటూ’.. ఓ అగ్ర హీరో నాపై అలిగారని అన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ తార మాస్టర్.

Tara Master about Tollywood Star Hero

‘వేరే హీరో సినిమాలకే వర్క్ చేస్తారా? మీరు నాకు డేట్స్ ఇవ్వనంటారా?.. నేను వేరే కొత్త మాస్టర్స్‌ని పరిచయం చేస్తానంటూ’.. ఓ అగ్ర హీరో నాపై అలిగారని అన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ తార మాస్టర్ (Tara Master). అలనాటి అగ్ర కథానాయకులందరి తోనూ తార మాస్టర్ వర్క్ చేశారు. సూపర్ డూపర్ హిట్‌ చిత్రాలకు వర్క్ చేసిన ఆమె అనుభవాలను ఏబీయన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. (NSR Interview)తో పంచుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి ఆమె మాట్లాడుతూ..

‘‘చిరంజీవి చాలా కష్టజీవి.. చాలా కష్టపడతారు. ఆయన దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా. రఫ్‌నెస్, కటింగ్స్ వంటివి మేము చేస్తాం కానీ.. మాకన్నా ఆయన బాగా చేస్తారు. ఆయన అలా చేయకపోతే ఇంత పెద్ద స్టార్ అవలేరు కదా. ఇక్కడ నేను డబ్బు గురించి చెప్పడం లేదు.. డబ్బులు, ఆస్తులు కాదు. నేమ్ గురించి చెబుతున్నాను. ఈరోజు ఆయన అంత గొప్ప పేరును సంపాదించారు. ఆయన గ్యాప్ ఇచ్చి, ఎంతో సర్వీస్ చేసి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయనకు అదే క్రేజ్ ఉండటం గొప్ప విశేషం. అందుకే ఆయన చాలా గ్రేట్. రియల్లీ గ్రేట్. ఆయనే కాదు.. మన హీరోలందరూ గ్రేట్’’ అని తార మాస్టర్ అన్నారు.


మీపై ఓ ఆరోపణ ఉంది. అప్పట్లో చిరంజీవి అన్ని సినిమాల సాంగ్స్‌కు మీరే డ్యాన్స్ డైరెక్టర్. చిరంజీవి అన్ని సినిమాలకు మీరే. ఇలా అన్ని సినిమాలు ఒప్పుకుని, మిగతా హీరోల సినిమాల విషయంలో అశ్రద్ధ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అవి మీ వరకు వచ్చాయా? అని ప్రశ్నించగా.. ‘ముందుగా ఈ ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ.. ‘‘నిజంగా నాకసలు తెలియదు. నేను నా రూట్‌లో వెళుతూ ఉన్నాను. సడెన్‌గా నాకు ఇతర హీరోల సినిమాలు తగ్గాయి. చిరంజీవి సినిమాలు కంటిన్యూగా చేస్తున్నాను.. దేవుడి దయవల్ల అన్ని హిట్స్ అవుతూ వచ్చాయి. ఇతర హీరోలవి కూడా హిట్స్ అవుతూనే ఉన్నాయి.


ఒక రోజు వేరే సెట్‌లో ఉన్న ఒక పెద్ద హీరో కనిపించారు. అక్కడికి వెళ్లి నమస్కారమండి అని చెప్పాను. ఆయన నా వైపు చూసి.. ‘ఏం మేడమ్.. మీరు నాకు డేట్స్ ఇవ్వనన్నారట?’ అని ప్రశ్నించారు. అయ్యో.. అదేం లేదండి అని చెప్పాను.. ‘లేదు.. మీరు వేరే హీరో అగ్రిమెంట్‌లో ఉన్నారట. నాకు డేట్స్ ఇవ్వలేదు మీరు.. నేను చాలా బాధపడ్డాను. అందుకని నేను కొత్త కొత్త మాస్టర్స్‌ని తీసుకొస్తున్నాను’ అని ఆయన అనగానే.. నేను బిత్తరపోయాను. అలా అడిగింది ఎవరో కాదు.. బాలకృష్ణనే. ఆయనకి అడిగే రైట్స్ ఉన్నాయి.. అడిగారు. బాలకృష్ణ చాలా మంచి మంచి మంచి మనిషి. ఆయన షూటింగ్ అంటే.. చక్కగా నవ్వుకుంటూ చేసుకునేవాళ్లం. ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఆయనతో ఈ డిస్కషన్ జరిగిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను. ఆయనతో కూడా అన్నీ హిట్సే..’’ అని తార మాస్టర్ వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

పవన్ అభిమాని నిరంజన్‌‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

Updated Date - Jun 20 , 2026 | 04:43 PM