సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విడుదలైన 'అరుణాచల గిరి ప్రదక్షిణ' గ్లింప్స్

ABN, Publish Date - Feb 23 , 2026 | 12:46 PM

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 'అరుణాచల గిరి ప్రదక్షిణ' చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో ఈ సినిమా జనం ముందుకు రానుంది.

Arunachala Giri Pradakshina Movie

'ఆట గదరా శివా' (Aata gadara Siva) అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి (Thanikella Bharani), సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'అరుణాచల గిరి ప్రదక్షిణ' (Arunachala Giri Pradikshina) చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.


భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Thummalapalli Rama Satyanarayana) నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్.లో సిద్ధహస్తుడైన యువ ప్రతిభాశాలి హర్ష ఎం. దర్శకత్వం వహిస్తుండగా, సంగీతద్వయం డా. ఎ. జె. సంధ్యవర్షిణి, డా. వి. ఆర్. ఎ. ప్రదీప్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం స్వరపరిచిన ఓ గీతానికి చింతల శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చగా, మధు గాత్రం అందించారు. మదర్ సెంటిమెంట్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న 'అరుణాచల గిరి ప్రదక్షిణ' అద్భుత విజయం సాధించాలని తనికెళ్ళ భరణి కోరుకున్నారు. రెండో షెడ్యూల్‌ షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుందని, ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.

Updated Date - Feb 23 , 2026 | 12:46 PM