మరోసారి మాస్ మహరాజా సినిమాలో మిల్కీ బ్యూటీ!

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:53 PM

గతంలో రవితేజ సరసన 'బెంగాల్ టైగర్' చిత్రంలో నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి మాస్ మహరాజా సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. రవితేజ 'ఇరుముడి'లోని ఓ పాత్ర కోసం మేకర్స్ తమన్నాను సంప్రదిస్తున్నారట.

Raviteja - Tamannah

మాస్ మహరాజా రవితేజ (Raviteja) సరసన 'బెంగాల్ టైగర్'లో నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah). ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రిపీట్ కాలేదు. నిజం చెప్పాలంటే... తమన్నా తెలుగులో సినిమాలు బాగా తగ్గించేసింది. ఈ మధ్య కాలంలో ఆమె 'ఓదెల' (Odela) సీక్వెల్‌లో శివయోగిని పాత్రను పోషించింది. ఆ సినిమా ఆ స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. గత కొంతకాలంగా తమన్నా పూర్తి స్థాయి పాత్రల కంటే ఐటమ్ సాంగ్స్ మీద దృష్టి ఎక్కువ పెడుతోంది. తక్కువ వర్కింగ్ డేస్‌లో ఎక్కువ పారితోషికం పొందే ఛాన్స్ అందులోనే ఉంటుంది. పైగా బాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తే వచ్చే పేరు అంతాఇంతా కాదు. ఆమె అలా ఐటమ్ సాంగ్స్ నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రతి ఒక్క నిర్మాత తమన్నాను అలాంటి పాటలు చేయమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా... రవితేజ సినిమాలో నటించబోతోందనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


ప్రస్తుతం రవితేజ 'ఇరుముడి' (Irumudi) అనే సినిమాలో నటిస్తున్నాడు. అందులో ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్. ఇదే సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం మేకర్స్ తమన్నాను సంప్రదించారని తెలుస్తోంది. ఆమె పారితోషికానికి సంబంధించిన చర్చలు ఫలప్రదమైతే... అధికారికంగా ఆ విషయాన్ని అతి త్వరలోనే రివీల్ చేస్తారు. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న ఈ సినిమాను శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. సో... తమన్నా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్‌కు అది ఉపయోగపడే అంశమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Updated Date - Mar 10 , 2026 | 04:54 PM