Tamannaah Bhatia: ఇంటిమేటెడ్ సీన్స్ కి నో.. ఆ డైరెక్టర్ అందరి ముందు అలా అన్నాడు
ABN, Publish Date - Jan 16 , 2026 | 07:54 PM
ఇండస్ట్రీలో ఎదగాలి అంటే కొన్ని కొన్నిసార్లు మనసుకు నచ్చని పనులు కూడా చేయాలి. ముఖ్యంగా హీరోయిన్లు.. డైరెక్టర్ ఎలాంటి పాత్ర ఇచ్చినా.. ఎలాంటి సీన్స్ చేయమన్నా చేయాలి.
Tamannaah Bhatia: ఇండస్ట్రీలో ఎదగాలి అంటే కొన్ని కొన్నిసార్లు మనసుకు నచ్చని పనులు కూడా చేయాలి. ముఖ్యంగా హీరోయిన్లు.. డైరెక్టర్ ఎలాంటి పాత్ర ఇచ్చినా.. ఎలాంటి సీన్స్ చేయమన్నా చేయాలి. స్టార్స్ అయ్యాకా ఆ కథ వేరుగా ఉన్నా.. కెరీర్ మొదట్లో మాత్రం ఏ హీరోయిన్ కూడా నో చెప్పే ధైర్యం చేయలేదు. కానీ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) మాత్రం కెరీర్ మొదట్లో తనకు నచ్చని సీన్స్ కు నో చెప్పానని, ఆ మాట మీదనే నిలబడ్డానని చెప్పుకొచ్చింది.
తమన్నా తన 16 వ ఏట ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తమిళ్, తెలుగు భాషల్లో ఆమె మంచి సినిమాలనే ఎంచుకుంటూ విజయాలను అందుకుంది. 20 ఏళ్ళ వయస్సుకు వచ్చేసరికి అటు తెలుగు.. ఇటు తమిళ్ భాషల్లో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ లు పట్టేసింది. ఆ సమయంలోనే ఆమె ఇంటిమేటెడ్ సీన్స్ కి నో చెప్పినట్లు తెలిపింది. తనకు ఇబ్బందిగా అనిపించిన సీన్స్ చేయనని డైరెక్టర్ ముందే చెప్పిన్నట్లు చెప్పుకొచ్చింది.
కెరీర్ మొదట్లో హీరోయిన్ల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో తమన్నా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ' ఒక సినిమా షూటింగ్ సమయంలో హీరోతో ఇంటిమేటెడ్ సీన్ చేయమని డైరెక్టర్ చెప్పారు. ఆ సీన్ చేయడం నాకు కంఫర్ట్‌గా లేకపోవడంతో నేను డైరెక్టర్‌కు స్పష్టంగా కుదరదు చేయను అని చెప్పాను. అప్పుడు ఆయన కోపంతో అందరి ముందే, హీరోయిన్‌ని మార్చండి అన్నారు. ఆ తరువాత ఆ సీన్ చేయాలనీ చాలా ప్రెషర్ పెట్టారు. కానీ నేను తగ్గలేదు. ఏం జరిగినా ఎదుర్కుంటానని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఆ తరువాత అదే దర్శకుడు నేను స్టార్ అయ్యాక వచ్చి నన్ను క్షమాపణలు కోరాడు. నో అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. హీరోయిన్లు.. ఎక్కడ నో చెప్తే రివెంజ్ తీసుకుంటారు. కెరీర్ ని నాశనం చేస్తారు అనే భయం లేకుండా ధైర్యంగా చెప్పినప్పుడే అది సురక్షితమైన చిత్ర పరిశ్రమ అనిపించుకుంటుంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.