సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భస్మ హారతిలో పాల్గొన్న తమన్నా ..

ABN, Publish Date - May 12 , 2026 | 09:49 PM

స్టార్ హీరోయిన్స్ ఎంత గ్లామర్ రంగంలో ఉన్నా కూడా భక్తిమార్గాన్ని వదలరు. తమ పనుల్లో బిజీగా ఉన్నా కూడా ఖాళీ చేసుకొని మరీ దైవదర్శనాలు చేస్తూ ఉంటారు. తాజాగా అందాల మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) సైతం ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతోంది.

Tamannaah Bhatia

స్టార్ హీరోయిన్స్ ఎంత గ్లామర్ రంగంలో ఉన్నా కూడా భక్తిమార్గాన్ని వదలరు. తమ పనుల్లో బిజీగా ఉన్నా కూడా ఖాళీ చేసుకొని మరీ దైవదర్శనాలు చేస్తూ ఉంటారు. తాజాగా అందాల మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) సైతం ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతోంది. తనదైన ఎనర్జీతో యూత్‌ను ఆకట్టుకుంటున్న స్టార్ హీరోయిన్, భక్తి మార్గంలో అడుగులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.తాజాగా తమన్నా ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంది. తెల్లవారుజామున జరిగే అతి పవిత్రమైన భస్మహారతిలో ప్రత్యక్షంగా పాల్గొని, మహాకాలుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. సంప్రదాయబద్ధమైన ఎరుపు చీరలో ఆలయ నియమాలన్నీ కఠినంగా పాటిస్తూ, భక్తితో మహాకాలుడిని దర్శించుకుంది. తమన్నాను అక్కడ చూసినవారంతా ఆశ్చర్యపోయారు.

నిర్మాత ప్రజ్ఞా కపూర్‌తో కలిసి తమన్నా ఆలయానికి వచ్చింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. ఆయన పిలుపు అందినప్పుడే మనం ఈ క్షేత్రానికి వస్తాము. స్వామివారి దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చింది అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ క్వీన్‌కి భక్తి కూడా ఎక్కువే అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచేస్తున్నారు.

ఇక ఆలయం విషయానికి వస్తే... ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో ప్రతి రోజు తెల్లవారుజామున జరిగే ఈ భస్మ హారతి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్రతువు. పవిత్ర భస్మతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా జననం, మరణం, పునర్జన్మ అనే కాలచక్రాన్ని సూచిస్తారు. ఈ హారతిలో పాల్గొనడం వల్ల మనసుకు, ఆత్మకు లోతైన శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

Updated Date - May 12 , 2026 | 10:00 PM