అప్పుడు ప్రేమికులు.. ఇప్పుడు ప్రత్యర్థులు
ABN, Publish Date - Jul 06 , 2026 | 03:37 PM
టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ రొమాంటిక్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) - టబు(Tabu) ఒకటి. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే లాంటి సినిమాల్లో వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ, రొమాన్స్ కి థియేటర్లు తగలబడిపోయాయి.
టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ రొమాంటిక్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) - టబు(Tabu) ఒకటి. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే లాంటి సినిమాల్లో వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ, రొమాన్స్ కి థియేటర్లు తగలబడిపోయాయి. ఈ జోడీకి అప్పట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అంతేనా ఇప్పటికీ వీరి మధ్య అదే స్నేహ బంధం కొనసాగుతోంది. టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాగార్జున వాళ్ళింట్లోనే ఉంటుందంట. ఇక ఇదంతా పక్కన పెడితే.. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ పెయిర్ మళ్ళీ వెండితెరపై ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ల్యాండ్‌మార్క్ మూవీ King 100 లో టబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే నాగార్జున కన్ఫర్మ్ చేశాడు.
ఇక దీంతో నాగ్ - టబు వింటేజ్ రొమాన్స్ చూడబోతున్నామని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణంలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సినిమాలో నాగార్జున పక్కన టబు రొమాన్స్ చేయడం లేదంట. ఆయనతో ఢీకొట్టే ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో ఆమె కనిపించబోతోందని టాక్. ఒకప్పుడు స్క్రీన్ మీద లవ్ అండ్ రొమాన్స్ తో మెప్పించిన ఈ జంట.. ఇప్పుడు ఈ చిత్రంలో నువ్వా-నేనా అంటూ మైండ్ గేమ్స్ ఆడే శత్రువులుగా మారబోతున్నారు. టబు నెగెటివ్ షేడ్స్ లో ఏ రేంజ్ యాక్టింగ్ ఇస్తుందో అంధాధున్ లాంటి సినిమాల్లోనే చూశాం. ఇప్పుడు నాగార్జున 100వ సినిమాలో ఆమె క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా, ఊరమాస్ రేంజ్ లో ఉండబోతోందని టాక్.
ఇక ఈ సినిమాకు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తండ్రీకొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో టబు కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అందులో ఒకరు సుస్మితా భట్ అని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా దసరా బరిలోకి దిగుతోంది. మరి 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న ఈ హిట్ పెయిర్.. ప్రేమికులుగా కాకుండా ప్రత్యర్థులుగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.