SYG: సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. డేట్ ఫిక్స్

ABN , Publish Date - Aug 15 , 2026 | 07:23 PM

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Sambarala Yeti Gattu Update

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu- SYG) చిత్రం, రీసెంట్‌గానే షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి చేసుకుంది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ (Rohith KP) దర్శకత్వంలో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తోన్న ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ డ్రామా.. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలతో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల (SYG Release Date) చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటిస్తూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి.


ఈ పోస్టర్‌ని గమనిస్తే.. ఇందులో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం పట్టుకుని టెర్రిఫిక్‌గా కనిపిస్తున్నారు. కాలిపోతున్న కట్టడాలు, పొగ, సంఘర్షణ, హై-వోల్టేజ్ యాక్షన్‌తో నిండిన ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇంకా ఇతర ప్రమోషనల్ కంటెంట్.. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పుడొచ్చిన ఈ పోస్టర్, విడుదల తేదీతో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది.


మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారనే ఇప్పటికే అప్డేట్ ఇచ్చారు. ఇందులో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ, బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఒక అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటంతో పాన్-ఇండియా ఎట్రాక్షన్‌ను మరింత పెంచుతోంది. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

అర్జున్ బర్త్‌డే స్పెషల్.. ‘పొలిమేర 3’లో పవర్‌ఫుల్‌ పోస్టర్ విడుదల

Fauzi: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ‘ఫౌజీ’ పోస్టర్ అరాచకం

40 ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా

Updated Date - Aug 15 , 2026 | 07:24 PM