సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Breaking: సై విల‌న్‌.. ప్ర‌దీప్ రావ‌త్ క‌న్నుమూత‌

ABN, Publish Date - Aug 04 , 2026 | 09:09 PM

ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ (Pradeep Ram Singh Rawat) క‌న్నుముశారు.

Pradeep Ram Singh Rawat

ప్ర‌ముఖ బాలీవుడ్‌, టాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ (74) క‌న్నుముశారు. చాలాకాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి మంగ‌ళ‌వారం తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స‌హ‌చ‌ర న‌టుడు య‌శ్‌పాల్ శ‌ర్మ త‌న ఇన్ స్టా అకౌంట్ ద్వారా తెలిపారు. ప్ర‌దీప్ రావ‌త్‌కు భార్య ఇద్ద‌రు సంతానం ఉన్నారు. అయ‌న అస‌లు పేరు ప్ర‌దీప్ రామ్ సింగ్ రావ‌త్‌ (Pradeep Ram Singh Rawat).

1985లో రాజ్ బ‌బ్బ‌ర్ 'ఐత్‌బార్' హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన రావ‌త్‌.. బీఆర్‌ చోప్రా నిర్మించిన 'మ‌హా భార‌త్' సీరియ‌ల్‌లో అశ్వ‌ద్ధామ‌గా న‌టించి వెలుగులోకి వ‌చ్చాడు. త‌ర్వాత‌ క్యారెక్ట‌ర్‌ యాక్టర్‌గా అనేక సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ 2000లో వ‌చ్చిన 'ల‌గాన్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు.

2004లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'సై' చిత్రంలో ప్ర‌తినాయ‌క‌ పాత్ర‌తో తెలుగులో అడుగు పెట్టిన ప్ర‌దీప్.. అన‌తికాలంలోనే విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ చిత్రం త‌ర్వాత‌ ఆయ‌న‌ మ‌ర‌లా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. 'సై' సినిమాతో వ‌చ్చిన గుర్తింపుతో ద‌క్షిణాది భాష‌ల‌న్నింటీలో న‌టించారు.

ముఖ్యంగా గ‌జిని సినిమాతో బాలీవుడ్‌లోనూ స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్నారు. అత్య‌ధికంగా తెలుగులో 100కు పైగా సినిమాల్లో న‌టించిన రావ‌త్‌ చివ‌ర‌గా గ‌త నెల‌లో త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన 'గాయప‌డ్డ సింహం' సినిమాలో క‌నిపించాడు. ప్ర‌దీప్ రావ‌త్ మ‌ర‌ణించిన‌ విష‌యం తెలుసుకున్న సినీ అభిమానులు, సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 09:56 PM