Swayambhu: వీఎఫ్‌ఎక్స్ పనుల్లో.. ‘స్వయంభు’ కీలక అప్డేట్!
ABN , Publish Date - May 23 , 2026 | 11:59 PM
నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభు’తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharth) తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభు’ (Swayambhu)తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో.. ఠాగూర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోన్న ఈ ఎపిక్ వెనుక ఉన్న వర్క్‌ని చిత్ర బృందం ఇప్పుడు సినీ ప్రేమికులకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ పనుల రేంజ్ ఏంటో చూపించారు.
ఇందులో హీరో నిఖిల్ సిద్ధార్థ, దర్శకుడు భారత్ కృష్ణమాచారి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కలిసి ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ ఫాంటమ్ ఎఫ్‌ఎక్స్‌ను సందర్శించారు. అక్కడ వందలాది మంది నిపుణులు ‘స్వయంభు’ ప్రపంచాన్ని అద్భుతంగా మలుస్తున్న తీరును ఈ వీడియోలో చూపించారు. ఈ చిత్రానికి ఏకంగా 2700కి పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పనిచేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రాచీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని ఇందులో రూపొందిస్తున్నారు. ప్రతి సీజీ లేయర్‌ను చిత్రబృందం స్వయంగా పర్యవేక్షిస్తూ, తమ విజన్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దుతోంది.
ముఖ్యంగా నిఖిల్, సెంథిల్ కుమార్ వీఎఫ్‌ఎక్స్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతి అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తుండటం విశేషం. ఈ మాగ్నమ్ ఓపస్‌లో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించగా, నిఖిల్ పోషిస్తున్న యోధుడి పాత్రలోని వీరత్వాన్ని ఆవిష్కరించిన తొలి పాట ‘రా రా ధీవరా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రవి బస్రూర్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ.. త్వరలోనే పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!
40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!
ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున
MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!