సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘మెగా యూత్‌ ఫోర్స్‌’ను మరింత బలోపేతం చేసే దిశగా...

ABN, Publish Date - Mar 24 , 2026 | 12:19 PM

మెగా అభిమానులను ఉద్దేశించి చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత కొణిదెల ఓ ప్రకటన విడుదల చేశారు.

మెగా అభిమానులను ఉద్దేశించి చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత కొణిదెల (Sushmitha) ఓ ప్రకటన విడుదల చేశారు. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ, యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన ‘మెగా యూత్‌ ఫోర్స్‌’ (Mega Youth Force) సంస్థకు నేషనల్‌ కన్వీనర్‌గా రాజమండ్రికి చెందిన ఏడిద బాబీని నియమించినట్లు సుస్మిత ప్రకటించారు. బాబీ నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతం అవుతూ సమాజసేవలో యువతకు మార్గదర్శి గా నిలుస్తుందని నమ్ముతున్నట్లు సుస్మిత ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు బాబీని అభినందించారు.


ఎన్నో ఏళ్లగా మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌, మెగా హీరోల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అభిమానులను చైతన్యపరుస్తూ ముందుకు నడిపించిన సేవలను పరిగణలోకి తీసుకుని బాబీకి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సుస్మిత తెలిపారు. త్వరలో మెగా హీరోల అభిమానులను సమన్వయం చేస్తూ యువశక్తిని కలుపుతూ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా పట్టణ, మండల స్థాయి వరకూ నూతన కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను విస్తరించి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటారనే నమ్మకాన్ని సుస్మిత వ్యక్తం చేశారు. మెగా అభిమానులంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగి సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సుస్మిత ఆకాంక్షించారు.  

 

Updated Date - Mar 25 , 2026 | 08:07 AM