సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి వచ్చేస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్

ABN, Publish Date - Sep 05 , 2026 | 09:20 PM

వర్సటైల్ నటుడు సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons).

Vishwanath and Sons

వర్సటైల్ నటుడు సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons). మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ థియేటర్ రన్ కొనసాగిస్తోన్న ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టినట్లు టాక్ నడుస్తోంది.


విశ్వనాథ్ అండ్ సన్స్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.


ఇక కథ విషయానికొస్తే.. సంజయ్ విశ్వనాథ్ కి పెళ్లి మీద అంతా నమ్మకం ఉండదు. దీంతో విదేశాలకు వెళ్ళి సరోగసి ద్వారా ఒక బిడ్డకు తండ్రి అవుతాడు. అంతా బావుంది అనుకున్న సమయంలో ఆ చిన్నారికి బోన్ మ్యారొ మార్చాల్సి వస్తుంది. డోనర్ కోసం చూస్తోన్న సమయంలో కన్నతల్లి అయిన మ్యాడీనే కొడుకుకు బోన్ మ్యారొ ఇస్తాను అంటుంది. ఈ క్రమంలో మ్యాడీ.. సంజయ్ ని లవ్ చేస్తుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వలన సంజయ్.. మ్యాడీని పెళ్లి చేసుకొను అని చెప్తాడు. మరి వీరిద్దరూ కలిశారా.. ? సంజయ్ మనసులో మ్యాడీ ఉందా.. ?.. సంజయ్ కి పెళ్లి మీద నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Sep 05 , 2026 | 09:24 PM