విశ్వనాథ్ అండ్ సన్స్: సూర్య పాడిన 'ది వెడ్డింగ్ సాంగ్' తెలుగు ప్రోమో విడుదల
ABN, Publish Date - Jul 23 , 2026 | 06:47 PM
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'ది వెడ్డింగ్ సాంగ్' తెలుగు ప్రోమో విడుదలైంది. సూర్య ఆలపించిన ఈ పూర్తి పాట జూలై 25న విడుదల కానుంది.
వీరభద్రుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య (Suriya) నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons). లక్కీ భాస్కర్ వంటి సంచలన విజయం తర్వాత వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు. ఫస్ట్ సింగిల్ అన్నీ మంచి బజ్ తీసుకు వచ్చాయి. అయితే జూలై 23 సూర్య జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ఈ మూవీ నుంచి సుకండ్ సింగిల్ ది వెడ్డింగ్ సాంగ్ (The Wedding Song) తెలుగు ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. Turn the volume up.. The celebrations are just getting started అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకుల్లో మరింత క్యూరియా సిటీని పెంచేస్తోంది.
అయితే.. ఫస్ట్ టైం సూర్య ఈ పాటను ఆలపించడం పాటకు మరింత ప్రత్యేకత ఏర్పడింది. ఆయన పాడిన ఈ వెడ్డింగ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటలో పెళ్లి వేడుకల సందడి, కుటుంబ సభ్యుల మధ్య ఉల్లాసంగా సాగింది. ఇదిలాఉంటే.. 'ది వెడ్డింగ్ సాంగ్' పూర్తి పాటను జూలై 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు ఈ రెండో పాటపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.