సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ లుక్ అదిరింది
ABN, Publish Date - Mar 02 , 2026 | 11:56 AM
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చారు.
సూర్య (Suriya) హీరోగా వెంకీ అట్లూరి (venky atluri) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ (NagaVamsi) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగడమే గాక చివరి దశలో ఉంది. మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (mamitha baiju) కథానాయిక కాగా రవీనా టాండన్ (raveena tandon) కీ రోల్ చేస్తోంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే.. ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి సుమారు 6 నెలలు కావొస్తుండగా ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమా పేరు 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath And Sons) అని తెలుపుతూ సూర్య ఫస్ట్ లుక్ రివీల్ చేయడంతో పాటు జూలై నెలలో థియేటర్లకు తీసుకు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ పోస్టర్‌లో సూర్య ఓ చంటి పిల్లాడిని ఎత్తుకుని కూల్ లుక్ లో ఉండి ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉన్నాడు. అంతేగాక పోస్టర్‌ను బట్టి చూస్తే సినిమా అంతా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌లో సాగుతున్నట్టు అనిపిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సారి కూడా ఏదో మ్యాజిక్ చేయడం గ్యారంటీ అనేలా ఈ పోస్టర్ ఉంది.