సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suresh Lankalapalli: 'రాచరికం' దర్శకుడి కొత్త సినిమా 'వింటర్'

ABN, Publish Date - Feb 02 , 2026 | 05:52 PM

'రాచరికం' చిత్రాన్ని రూపొందించిన సురేశ్‌ లంకలపల్లి తాజాగా 'వింటర్' పేరుతో మరో సినిమా రూపొందిస్తున్నారు. కశ్మీర్ లో జరిగిన యదార్థ సంఘటల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Winter Movie opening

క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వింటర్’. రామ్, ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ, శ్రీజిత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ‘రాచరికం’ (Racharikam) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్ లంకలపల్లి (Suresh Lankalapalli) ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాతో రిజ్వాన్ అలీ విలన్‌గా తెరకు పరిచయం కానున్నారు. ఈ మూవీని కశ్మీర్ (Kashmir) లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.


‘వింటర్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు. చిత్ర ప్రారంభోత్సవంలో టీం అంతా పాల్గొంది. సినిమా అద్భుతంగా రావాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని కోరుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, ఇతర టెక్నికల్ టీంకు సంబంధించిన వివరాల్ని ప్రకటించనున్నారు.

Updated Date - Feb 02 , 2026 | 05:52 PM