పాతికేళ్ల కుర్రాడితో బెడ్ పై సురేఖావాణి .. నేను కాదంటుందేంటి
ABN, Publish Date - Nov 07 , 2026 | 02:24 PM
ఈ జనరేషన్ లో సోషల్ మీడియాని మించిన పెద్ద ఆయుధం ఏది లేదు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒకరిని పైకి లేపాలన్నా.. ఒకరిని కిందకు దించాలన్నా దీనికి మించి మరో ఆప్షన్ ఇంకొకటి లేదు.
ఈ జనరేషన్ లో సోషల్ మీడియాని మించిన పెద్ద ఆయుధం ఏది లేదు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒకరిని పైకి లేపాలన్నా.. ఒకరిని కిందకు దించాలన్నా దీనికి మించి మరో ఆప్షన్ ఇంకొకటి లేదు. ఒకప్పుడు ఏది పడితే అది మాట్లాడే సెలబ్రిటీలు సైతం ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఈ సోషల్ మీడియాలో ఎక్కడ ట్రోలింగ్ చేసి పరువు తీస్తారేమో అనే భయం. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలన్నా, ఒక వీడియో పెట్టాలన్నా వందసార్లు ఆలోచించి మరీ పెడుతున్నారు. కానీ, కొంతమంది సెలబ్రిటీలు మాత్రం అనుకోకుండా తమ పర్సనల్ విషయాలకు సంబంధించి పోస్టులు పెట్టి తరువాత వెంటనే డిలీట్ చేసి ట్రోలింగ్ మెటీరియల్ గా మారుతున్నారు. తాజాగా సీనియర్ నటి సురేఖావాణి కూడా ఇలాంటి ట్రోలింగ్ నే ఎదుర్కొంటోంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది సురేఖావాణి. సినిమాల సంగతి పక్కన పెడితే.. కూతురు సుప్రీతతో కలిసి అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈమధ్య కొంచెం సైలెంట్ అయినా.. ఒకప్పుడు ఈ తల్లీకూతుళ్లు పోస్ట్ చేసే వీడియోలు, చేసిన ఇంటర్వ్యూలు ఈ రేంజ్ లో రచ్చ చేసాయో అందరికీ తెల్సిందే. ముఖ్యంగా సురేఖావాణికి పెళ్లి చేయాలని సుప్రీత చూస్తున్నట్లు, అమ్మకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. అయితే ముందు కూతురు పెళ్లి చేయాలని సురేఖావాణి తెలివిగా తప్పించుకుంది. ఆ తరువాత ఈ తల్లీకూతుళ్లు... వెకేషన్ కి వెళ్ళడాలు, డ్రగ్స్ కేసులో పేర్లు బయటకు రావడాలు, పొలిటికల్ ట్రోలింగ్స్ ఇలా ఒకటి అని కాకుండా నిత్యం సోషల్ మీడియాలో నానుతూనే ఉన్నారు.
తాజాగా సురేఖావాణి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఒక పాతికేళ్ల కుర్రాడితో ఆమె రొమాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఉన్నాయి. వారిద్దరూ అంతా క్లోజ్ గా కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారని అర్ధమైపోతుంది. దీంతో ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాని షేక్ చేసింది. 'ఇది సురేఖావాణి అసలు రూపం. 45 ఏళ్ల వయస్సులో పాతికేళ్ల కుర్రాడితో ఈ రేంజ్ లో రిలేషన్ నడిపిస్తోంది అంటే మామూలు విషయం కాదు' అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో తప్పు గ్రహించిన సురేఖావాణి వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి అందరూ చెప్పే మాట చెప్పేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని ఎవరో కావాలనే హ్యాక్ చేసి తన పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేసినట్లు మరో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా తన ప్రైవసీని గౌరవించాలని, ఇది సీరియస్ విషయమని చెప్పుకొచ్చింది.
'నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. నా ప్రైవేట్ కంటెంట్ నా అనుమతి లేకుండా సర్క్యులేట్ అవుతోంది. మీమ్ పేజీలు, మీడియా, ప్రెస్ ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులతో సహా అందరినీ నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఈ కంటెంట్‌ను ఏ రూపంలోనైనా షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం లేదా సర్క్యులేట్ చేయడం తక్షణమే నిలిపివేయండి. నా ప్రైవేట్ కంటెంట్‌ను షేర్ చేసినా, ప్రచురించినా లేదా మరింత ప్రచారం చేసినా సరే.. ఏ అకౌంట్ ని అయినా, ఏ వ్యక్తి అయినా సరే వారి వివరాలను గుర్తించి, ఆధారాలు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి వ్యూస్, రీచ్ లేదా పబ్లిసిటీ కోసం ఈ పరిస్థితిని దుర్వినియోగం చేయవద్దు. నా ప్రైవసీని గౌరవించండి. ఇది చాలా సీరియస్ విషయం. చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి నేను సంకోచించను' అని చెప్పుకొచ్చింది.
ఇక్కడవరకు బాగానే ఉన్నా.. నెటిజన్స్ మాత్రం వేరే యాంగిల్ లో అమ్మడిని పట్టేశారు. 'సోషల్ మీడియా హ్యాక్ అయ్యింది అని మాత్రమే క్లారిటీ ఇచ్చావ్ కానీ, అతనితో ఉన్నది నేను కాదు అని మాత్రం చెప్పలేదు. అంటే అతనితో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అన్న మాట. కావాలనే ఆ వీడియో పోస్ట్ చేసి.. ట్రోలింగ్ వచ్చేసరికి డిలీట్ చేసి, మళ్లీ ఇప్పుడు హ్యాక్ అయ్యిందంటూ కవర్ చేస్తున్నావు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఇంతా చేసి నేను కాదంటుందేంటి సురేఖా వాణి?' అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈ వీడియో ట్రోలింగ్ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.