సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dheeraj Mogilineni: ఇతర భాషల సినిమాలకు బ్రహ్మరథం.. మన సినిమాలొస్తే విమర్శలా?

ABN, Publish Date - Nov 08 , 2026 | 10:43 AM

ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలకు మనం బ్రహ్మరథం పడుతున్నాం. చాలా మంది వాటినే స్ఫూర్తిగా చెబుతున్నారు. అలాంటి చిత్రాలే మన భాషలో వస్తే విమర్శిస్తున్నారు.

"ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలకు మనం బ్రహ్మరథం పడుతున్నాం. చాలా మంది వాటినే స్ఫూర్తిగా చెబుతున్నారు. అలాంటి చిత్రాలే మన భాషలో వస్తే విమర్శిస్తున్నారు. మన సినిమాల్ని మనం గుర్తించడం మానేశాం" అని ధీరజ్‌ మొగిలినేని (Dheeraj Mogilineni) అన్నారు. ఆయన నిర్మాణంలో రూపొందిన సినిమా ‘సమ్మర్‌ హాలిడేస్‌’ (Summer Holidays) . రోహన్, అరుణ్‌దేవ్, బేబీ ఖుషి, జయసుధ, వాసుకి, హర్షిణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి శ్రీకర్‌ నయన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.

ధీరజ్‌ మాట్లాడుతూ.. ‘‘సత్యం సుందరం’, ‘90స్‌ - ఎ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’, ‘35 చిన్న కథ కాదు’ తరహాలో తెలుగు ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో ‘సమ్మర్‌ హాలిడేస్‌’ సినిమా తీశాం. ఇలాంటి సినిమాల్ని థియేటర్లకు వెళ్లి ఆదరిస్తేనే మరిన్ని మంచి కథలు, ప్రతిభగల దర్శకులు పరిశ్రమకు వస్తారు. తీరిగ్గా చూద్దాం అనుకుంటే ప్రేక్షకులు ఓ మంచి సినిమాకు దూరమైనట్టే అవుతుంది. ఓటీటీలో వచ్చినప్పుడు చూసి, సోషల్‌ మీడియాలో పొగుడుతూ పోస్టులు పెడితే తెలుగు సినిమాకు ఏ ప్రయోజనం ఉండదు. ఆడియన్స్‌ థియేటర్లకు రావడం లేదనే కారణంతో చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు. మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులంతా థియేటర్లకు రావాలి. పిల్లలకు పుస్తకాలు, ర్యాంకులే ప్రపంచం కాకూడదు. వాళ్లకు ఇలాంటి సినిమాల్ని చూపించినా చాలా నేర్చుకుంటారు’’ అన్నారు.

‘‘ఏ దర్శకుడైనా మంచి సినిమా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు’’ అని దర్శకుడు అన్నారు.

ALSO READ:

Diwali: అమ్మతో అనుబంధం.. మట్టి దీపాల అందం.. తారల దీపావళి విశేషాలు

Nayanthara: నయనతారకు వరుస షాకులు.. ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్స్!

‘భోగి’ ఈవెంట్ వాయిదా.. ఆ చిక్కే కారణమా

Updated Date - Nov 08 , 2026 | 10:56 AM