బాబు.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు
ABN, Publish Date - Mar 09 , 2026 | 04:37 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం వారణాసి (Vaaranaasi) సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం వారణాసి (Vaaranaasi) సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే వారణాసి సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెల్సిందే.
మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా తన మేకోవర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మునుపెన్నడూ లేనివిధంగా మహేష్.. జుట్టు, గడ్డం పెంచి కనిపించనున్నారు. అందుకు కారణం.. ఇందులో రాముడిగా కూడా మహేష్ కనిపించనున్నారు. మొదటి నుంచి మహేష్ వారణాసి లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఆయన ఎయిర్ పోర్ట్ లో కనిపించినా అది ట్రెండ్ గా మారుతోంది.
తాజాగా మహేష్ న్యూ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జార్జియాలో షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ కు చేరుకున్న మహేష్ న్యూ లుక్ అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది అంటే అతిశయోక్తి కాదు. గుబురు గడ్డం.. పొడవాటి జుట్టు.. గాగుల్స్, హెయిర్ ని కప్పి ఉంచేలా క్యాప్ పెట్టుకొని.. బ్లాక్ షర్ట్ ఫై బ్రౌన్ కలర్ జాకెట్ ధరించి నడుచుకుంటూ వస్తుంటే.. బాబు..హాలీవుడ్ హీరోలా కనిపించారు. ఫ్యాన్స్ కూడా బాబును హాలీవుడ్ హీరోతోనే పోలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వారణాసి సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.