సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ రెండు సినిమాలు.. సందడంతా బాబుదే

ABN, Publish Date - Jun 24 , 2026 | 03:33 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా.. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా వారణాసి (Varanasi).

Mahesh Babu

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా.. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా వారణాసి (Varanasi). ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్న మహేష్, గత కొన్ని నెలలుగా ఎక్కడా పబ్లిక్ లైమ్‌లైట్‌లో కనిపించకుండా చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న విషయం తెల్సిందే. మహేష్ హెరోగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతోన్న విషయం విదితమే. వారణాసి షూటింగ్ తో బిజీ ఉండి వేరే సినిమాల ప్రమోషన్లకు కూడా ఆయన పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత జూలై నెలలో సూపర్‌స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల ప్రమోషన్ల కోసం పబ్లిక్ ముందుకు రాబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మహేష్ బాబు మొదటగా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ లీడ్ రోల్‌లో నటించిన రావు బహదూర్ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తుండగా.. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మంగళవారం రాత్రి మహేష్ బాబు వీక్షించారు. సినిమా అవుట్‌పుట్ చూసి ఎంతో ఇంప్రెస్ అయిన సూపర్‌స్టార్, హాలిడే ట్రిప్ ముగించుకుని రాగానే జూలై 3న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొననున్నారు.

ఇక దీనితో పాటు తన మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న శ్రీనివాస మంగాపురం సినిమాకు కూడా మహేష్ బాబు తన వంతు సపోర్ట్ అందించనున్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో జూలై మొదటి వారంలో జరగబోయే శ్రీనివాస మంగాపురం ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. ఏదేమైనా జూలై నెలలో చాలా తక్కువ గ్యాప్‌లో తమ అభిమాన హీరోని రెండు సార్లు పబ్లిక్ వేదికలపై చూసే గోల్డెన్ ఛాన్స్ రావడంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Updated Date - Jun 24 , 2026 | 04:00 PM