రామాయణ రివ్యూ చెప్పిన మహేష్ బాబు..

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:16 PM

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూసిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' (Ramayana) ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి నటించిన ఈ సినిమాకి నితీశ్ తివారీ దర్శకత్వం వహించగా నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు

Mahesh Babu

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూసిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' (Ramayana) ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి నటించిన ఈ సినిమాకి నితీశ్ తివారీ దర్శకత్వం వహించగా నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 5 న రిలీజ్ అయిన ఈ దృశ్యకావ్యం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విజువల్ వండర్ గా ఉందని, జెన్ జీకి రామాయణ కథను ఎలా చూపించాలో అలానే చూపించినట్లు నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.


ఇక మొదటి నుంచి ఈ సినిమాకి సెలబ్రిటీలు కూడా సపోర్ట్ గా నిలబడ్డారు. మొన్నటికి మొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రామాయణకి ఆల్ ది బెస్ట్ చెప్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సేన్సెషన్ గా మారింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రామాయణ చిత్రానికి మద్దతుగా నిలిచాడు. సినిమా ఏదైనా.. హీరో ఎవ్వరైనా.. తనకు నచ్చితే భాషతో సంబంధం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్తాడు మహేష్. తాజాగా రామాయణ గురించి కూడా ఆయన పోస్ట్ పెట్టాడు. మనం చిన్నప్పటి నుంచి వింటూ, ఎంతో ఆరాధిస్తూ పెరిగిన పౌరాణిక గాథలు వెండితెరపై ఇంత అద్భుతంగా ప్రాణం పోసుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన పేర్కొన్నాడు.


'చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరిగిన కథలు వెండితెరపై ఇంత అద్భుతంగా జీవం పోసుకోవడం చూడటం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. రణ్‌బీర్, యశ్, సాయి పల్లవి... మీ నటన మ్యాజికల్. నమిత్ మల్హోత్రా, నితీశ్ తివారీ... హాట్సాఫ్! ఇంతటి భారీ స్థాయి సినిమాను నిర్మించి, తీర్చిదిద్దడంలో మీరు పడిన శ్రమకు నా అభినందనలు. రామాయణ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చాడు. ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకువెళ్లేలా రూపొందుతున్న ఈ పౌరాణిక కావ్యంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా స్పందించడంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తర్వాత మరో స్టార్ హీరో కూడా ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలవడంతో రామాయణ చిత్రానికి టాలీవుడ్ నుంచి భారీ స్థాయిలో సపోర్ట్ లభిస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ముందు ముందు రామాయణ ఎలాంటి రికార్డులను బద్దలుకొడుతుందో చూడాలి.

Updated Date - Nov 06 , 2026 | 12:19 PM