'కరికాల'.. సందీప్ కిషన్ పిచ్చెక్కించాడుగా
ABN, Publish Date - Aug 05 , 2026 | 12:14 PM
సందీప్ కిషన్ కథానాయకుడిగా‘శంబాల’ ఫేమ్ దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
సందీప్ కిషన్ (Sandeep Kishan) కథానాయకుడిగా‘శంబాల’ ఫేమ్ దర్శకుడు యుగంధర్ ముని (Yugandhar Muni) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సందీప్ నటిస్తున్న ఈ 33వ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రారంభించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపుకు రాగా ఈ నెలలోనే ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనుండడం విశేషం.
అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధంచి ఓ ఆసక్తికర అప్డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. ఈ మూవీకి కరికాల (Karikaala) అనే పేరు ఫిక్స్ చేయడంతో పాటు సినిమాను రెండు భాగాలుగా విడదుల చేయనున్నట్లు ప్రకటించారు. తొలి భాగాన్ని వచ్చే సంవత్సరం జూలై 2న, సెకండ్ పార్ట్‌ను అదే యేడు దసరాకు ఆక్టోబర్28న థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అధికారికంగా ప్రటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సైతం సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది. మీరూ ఓ లుక్ వేయండి.