సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గంట మోగిందో.. మంట లేచిన‌ట్టే! సూప‌ర్ సుబ్బు.. ట్రైల‌ర్ అదిరింది

ABN, Publish Date - Jun 24 , 2026 | 08:39 PM

చాలా విరామం త‌ర్వాత సందీప్ కిష‌న్ (Sundeep Kishan) న‌టించిన వెబ్ సిరీస్‌ సూప‌ర్ సుబ్బు.

Super Subbu

చాలా విరామం త‌ర్వాత సందీప్ కిష‌న్ (Sundeep Kishan) న‌టించిన వెబ్ సిరీస్‌ సూప‌ర్ సుబ్బు (Super Subbu). నెట్‌ఫ్లిక్స్ నుంచి వ‌స్తున్న తొట్ట‌తొలి తెలుగు సిరీస్ కూడా ఇదే కావ‌డం విశేషం. మిథిలా పాల్క‌ర్ (Mithila Palkar), మాన‌సా చౌద‌రి (Maanasa Choudhary) క‌థానాయిక‌లుగా న‌టించ‌గా బ్ర‌హ్మానందం, సంపూర్ణేశ్‌ బాబు, ముర‌ళీ శ‌ర్మ (Murli Sharm), ర‌చ్చ‌ ర‌వి కీల‌క పాత్ర‌లు పోషించారు.

సుమారు రెండేండ్లుగా నిర్మాణంలో ఉన్న‌ ఈ వెబ్ సిరీస్‌ ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ఎదుట‌కు రాబోతుంది. ఇప్ప‌టికే ఈ సిన‌మా నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్ అదిరిపోయే ఆద‌ర‌ణ ద‌క్కించుకోగా తాజాగా బుధ‌వారం ఈ సిరీస్‌ టీజ‌ర్ విడుద‌ల చేశారు. సుమారు రెండు నిమిషాల 44 సెకండ్ల పాటు సాగిన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం కామెడీ పండిస్తూ పంచ్ డైలాగ్స్, సింగిల్ లైన‌ర్స్ తో అద్యంతం అల‌రించేలా ఉంది.

నిత్యం అల్ల‌రిగా తిరిగే సుబ్బు ఏదో ఒక గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం కావాల‌ని తెలిసిన వారిని ప్ర‌స‌న్నం చేసుకుని చివ‌ర‌కు ఓ జాబ్ సంపాదిస్తాడు. అయితే అది కుటుంబ నియంత్ర‌ణకు సంబంధించిన ఉద్యోగం కావ‌డంతో మాకీపూర్ అనే మారుమూల గ్రామానికి వెళ్లాల్సి వ‌స్తుంది.

అక్క‌డ సుబ్బు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించేలా ఈ సిరీస్ రూపొందిన‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. డీజే టిల్లు ఫేమ్‌ మల్లిక్ రామ్ (Mallik Ram) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవ‌నుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Jun 24 , 2026 | 08:46 PM