సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యగారు అఖిల్ కాదు.. నేను అంటున్న అక్కినేని హీరో

ABN, Publish Date - Sep 07 , 2026 | 05:21 PM

ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు ఫ్యాన్స్ కొన్ని ట్యాగ్స్ ఇస్తారు. చిరంజీవికి మెగాస్టార్.. మహేష్ బాబుకి సూపర్ స్టా.. పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అని.. అలాగే అఖిల్ అక్కినేనికి అయ్యగారు అనే ట్యాగ్ ఇచ్చారు.

Mahendragiri Varahi

ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు ఫ్యాన్స్ కొన్ని ట్యాగ్స్ ఇస్తారు. చిరంజీవికి మెగాస్టార్.. మహేష్ బాబుకి సూపర్ స్టా.. పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అని.. అలాగే అఖిల్ అక్కినేనికి అయ్యగారు అనే ట్యాగ్ ఇచ్చారు. ఆ ట్యాగ్స్ వారికి తప్ప ఇంకెవరికీ సెట్ కావు. తాజాగా అక్కినేని వారసుల్లో ఒకరైన సుమంత్.. అయ్యగారు ట్యాగ్ నాది అని చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి చిత్రం సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అఖిల్ హాజరయ్యాడు.


ఇక ఈ ఈవెంట్ లో సుమంత్ మాట్లాడుతున్న సమయంలో అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు.. అయ్యగారు అంటూ గట్టిగా అరిచారు. దీనిపై సుమంత్ స్పందిస్తూ.. అక్కినేని కుటుంబంలో పెద్ద మనవడిని తానే కాబట్టి అయ్యగారు అనే ట్యాగ్ ఇస్తే తనకే ఇవ్వాలని, అఖిల్‌కు కాదని చెప్పుకొచ్చాడు. అసలైన అయ్యగారు ట్యాగ్ తనదే కాబట్టి తననే అయ్యగారు అని పిలవాలని సరదాగా జోక్ చేశాడు. ఆయన సరదాకి అన్నా కూడా అక్కినేని ఫ్యాన్స్.. అయ్యగారు ఫ్యాన్స్ మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోవడం లేదు. అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చివరి వారసుడు అఖిల్‌కు అభిమానులు ఎలాంటి అధికారిక బిరుదు ఇవ్వకపోయినా.. నాగరాజు అనే ఓ వీరాభిమాని ఆవేశంతో అన్న ఒక్క మాట వల్ల ఆయన పేరు వెనుక అయ్యగారు అనే ట్యాగ్ చేరిపోయింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ వచ్చినా.. అఖిల్ ఆ అభిమానిని గుర్తించి కలవడంతో ఆ ట్యాగ్ కాస్తా గట్టిగానే ఫిక్స్ అయిపోయింది. అది కేవలం అఖిల్ కి మాత్రమే సెట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా చెప్పుకొస్తున్నారు.


ఇక ఈ సరదా కామెంట్ల అనంతరం, అఖిల్‌పై ఉన్న ప్రేమను సుమంత్ ఎమోషనల్‌గా వ్యక్తం చేశాడు. 'చిన్నవాడైనా సరే నా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చాడు. అఖిల్ లెనిన్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. క్లైమాక్స్ 40 నిమిషాల్లో అఖిల్ చూపించిన మెచ్యూరిటీ, యాక్టింగ్ అద్భుతం అని ప్రశంసించాడు. అఖిల్ కూడా తాను చిన్నప్పటి నుంచి సుమంత్ ఒడిలోనే పెరిగానని, తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలు కూడా ఆయనకే చెప్పేవాడినని వారి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

Updated Date - Sep 07 , 2026 | 05:21 PM