కొరియన్ కనకరాజు టాక్‌పై మెగాస్టార్ స్పందనిదే..
ABN , Publish Date - Aug 07 , 2026 | 02:07 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన సరికొత్త హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాకు వస్తోన్న టాక్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), రితికా నాయక్ (Ritika Naik) జంటగా నటించిన సరికొత్త హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్స్‌కే ఈ సినిమా అద్భుతమైన టాక్‌ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా కామెడీ హైలెట్ అనేలా టాక్ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా సాధిస్తున్న విజయం, వినిపిస్తోన్న టాక్‌పై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు చిరు చేసిన ఆసక్తికర ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
‘కొరియన్ కనకరాజు’ సినిమాకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని మెగాస్టార్ కొనియాడారు. ‘‘ఎక్కడ చూసినా ‘నవ్వులే నవ్వులు’ అనే ఒక్కటే రెస్పాన్స్ వినిపిస్తోంది. మై డియర్ వరుణ్ తేజ్.. నువ్వు ఈ విజయానికి పూర్తి అర్హుడివి, హృదయపూర్వక అభినందనలు! నీ కష్టానికి, అంకితభావానికి తగిన ప్రతిఫలం లభించింది’’ అని పేర్కొంటూ వరుణ్ తేజ్‌పై చిరంజీవి ప్రత్యేక ప్రేమాభిమానాలను కురిపించారు.
అంతేకాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా మలిచిన దర్శకుడు మేర్లపాక గాంధీ, నటుడు సత్య, హీరోయిన్ రితికా నాయక్, యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలతో పాటు చిత్రబృందానికి తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తాను కూడా ఈ సినిమాను త్వరలోనే చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని పెద్ద రికార్డులను సాధించాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో వరుణ్ తేజ్ అభిమానులు, చిత్రబృందం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ ట్వీట్‌కు చిత్రయూనిట్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
ఈ వార్తలపై కూడా ఓ లుక్ వేయండి:
Lenin OTT: లెనిన్.. ఓటీటీకి వచ్చేశాడు
Korean Kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రివ్యూ
Pradeep Rawat: కంట తడి పెట్టిస్తున్న ప్రదీప్ రావత్ తనయుడి మాటలు..