సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుడిగాలి సుధీర్ 'గోట్‌'కు యు/ఎ

ABN, Publish Date - Mar 16 , 2026 | 04:15 PM

సుడిగాలి సుధీర్‌ నటించిన 'గోట్‌' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. మార్చి 26న 'గోట్‌' మూవీ విడుదల కాబోతోంది.

Sudigali Sudheer

ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జి.ఓ.ఎ.టి.' (గోట్ Goat). గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి (Divya Bharathi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ఈ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం తాజాగా సెన్సారును పూర్తిచేసుకుంది. సెన్సారు బృందం ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.


ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, 'సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంది. అది అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Mar 16 , 2026 | 04:17 PM