సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్.. శ్రీదేవి కూతురా.. మజాకానా

ABN, Publish Date - May 18 , 2026 | 03:21 PM

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇండస్ట్రీకి పరిచయమైంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నించింది.

Janhvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇండస్ట్రీకి పరిచయమైంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నించింది. విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఆశించినంత గుర్తింపును అందుకోలేదు. దీంతో అమ్మడి చూపు టాలీవుడ్ మీద పడింది. దేవర సినిమాతో జాన్వీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు ఎంత మంచి ఆఫర్ వచ్చినా.. ఎన్టీఆర్ తోనే నటించాలని బలంగా కోరుకొని.. దేవరతో ఆ కోరికను నెరవేర్చుకొంది.


ఇక బాలీవుడ్ లో చేసిన తప్పు చేయకుండా టాలీవుడ్ కెరీర్ ని మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది జాన్వీ. దేవర రిలీజ్ అవ్వకముందే పెద్దిలో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం అందిపుచ్చుకుంది. ఇక ఈ సినిమా జాన్వీ కెరీర్ ని మలుపు తిప్పబోతోందని అంటున్నారు. చిన్న క్యారెక్టర్ అయినా కూడా అమ్మడి అందానికి ఫిదా అవ్వడం ఖాయమని టాక్. జూన్ 4 న పెద్ది సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ చిన్నది మరో లక్కీ ఛాన్స్ పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.


పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం రాకా. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాగూర్, రష్మిక మందన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కూడా రాకాలో ఒక హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. వచ్చే నెలలో జాన్వీ రాకా సెట్ లో అడుగుపెడుతోందంట. ఈ విషయాన్నీ మేకర్స్ చాలా జాగ్రత్తగా దాచినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే జాన్వీ చాలా గట్టిగా కెరీర్ ని ప్లాన్ చేస్తోందని చెప్పొచ్చు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ పట్టేసి స్టార్ హీరోయిన్ గా పాగా వేయడానికి చూస్తోంది. మరి తల్లిలా కూతురు కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలుస్తుందా లేదా చూడాలి.

Updated Date - May 18 , 2026 | 03:40 PM