సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నో బ్రేక్.. ఓన్లీ వ‌ర్క్‌! య‌మా స్పీడుగా 'వార‌ణాసి'

ABN, Publish Date - Mar 18 , 2026 | 10:31 PM

రాజమౌళి కలయికలో వస్తున్న ప్యాన్ వరల్డ్ చిత్రం వారణాసి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Varanasi

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కలయికలో వస్తున్న ప్యాన్ వరల్డ్ చిత్రం వారణాసి (Varanasi). ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఈ సినిమా గురించి చాలా మందికి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందుతూనే ఉన్నాయి.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ (Priyanka chopra) కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ పాత్రలో కనిపించనున్నారు.ఈ కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను టార్గెట్ చేస్తూ జక్కన్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువల కలయికగా తీర్చిదిద్దుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో కీలకమైన టాకీ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో హీరో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయని అంతేకాకుండా సినిమా కథలో ఇవి చాలా కీలకమైన మలుపులుగా నిలుస్తాయని సమాచారం.

రాజమౌళి మార్క్ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సీన్స్‌లో పుష్కలంగా ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్. నిర్మాణానంతర పనుల విషయంలో కూడా చిత్ర యూనిట్ ఎక్కడా రాజీ పడటం లేదు. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రాణవాయువు లాంటి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. గ్రాండ్ విజువల్స్ కోసం రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించే క్రమంలో గ్రాఫిక్స్ పనులను వేగవంతం చేశారు. హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్ కోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తూ, ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, కార్తికేయ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేష్-రాజమౌళి కాంబినేషన్ సెట్ అవ్వడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 10:31 PM