ఎంత రాజమౌళి అయినా.. భార్యకి లోకువే
ABN, Publish Date - Sep 30 , 2026 | 05:51 PM
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్స్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకీ చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సెట్‌లో ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్స్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకీ చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సెట్‌లో ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ ఫ్రేమ్‌ను పర్‌ఫెక్ట్‌గా చెక్కే ఆయనను అందరూ ప్రేమగా జక్కన్న అని పిలుచుకుంటారు. అయితే అంతటి గ్లోబల్ డైరెక్టర్ కూడా ఇంట్లో తన హోమ్ మినిస్టర్ ముందు సాధారణ భర్తేనని నిరూపించే ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
రాజమౌళి కొడుకు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఈవెంట్‌కు రాజమౌళి తన సతీమణి రమా రాజమౌళితో కలిసి హాజరయ్యారు. అయితే ఈవెంట్ బ్యాక్‌స్టేజ్ వద్ద రాజమౌళిని ఆయన సతీమణి రమా వేదిక వైపు వెళ్లమని నడు అంటూ సరదాగా ముందుకు తోశారు. జక్కన్న కూడా ఎలాంటి కోపం చూపించకుండా నవ్వుతూ స్టేజ్ మీదకు వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే అంతటి పెద్ద దర్శకుడిని రమా చాలా క్యాజువల్‌గా తోసేయడం, రాజమౌళి సైతం ఏమాత్రం ఈగో లేకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ స్టేజ్ వైపు వెళ్లడం అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డైంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అమ్మా అమ్మా.. ఆయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ డైరెక్టరమ్మా.. అలా నెట్టేస్తే ఎలా? కాస్త చూసుకోండమ్మా.. అని కొందరు.. ఎంత మహా బలుడు అయినా భార్యకి లోకువే అని ఇంకొందరు.. మరికొందరైతే ఇంట్లో పవర్ అంతా హోమ్ మినిస్టర్‌దే.. గ్లోబల్ డైరెక్టర్ అయినా సరే భార్య ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. రాజమౌళికి ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా, పబ్లిక్ ఫంక్షన్లలో ఆయన ఉండే సింప్లిసిటీకి అభిమానులు మరోసారి ఫిదా అవుతున్నారు.