సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

SS Rajamouli: ఇంకో నాలుగు నెలలు అంతే.. ఆ వెర్షన్‌కు మాత్రం..

ABN, Publish Date - Jun 26 , 2026 | 06:28 PM

రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ (varanasi) చిత్రం మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని జక్కన్న స్వయంగా వెల్లడించారు

SS Rajamouli

రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ (varanasi) చిత్రం మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని జక్కన్న స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్‌ యానిమేషన్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ‘వారణాసిలో ముఖ్యమైన సన్నివేశాలను పూర్తిచేశాం. యాక్షన్‌ సీక్వెన్స్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం కథను లింక్‌ చేసే సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మొదటి వారానికి షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది’ అని అన్నారు. ఐమాక్స్‌ ఫార్మాట్‌లో రూపొందించడం గురించి చెబుతూ ‘వారణాసి’ని ఐమాక్స్‌లో అయితే అద్భుతంగా ఉంటుందని ప్రారంభంలోనే అనుకున్నాం.

అయితే దీని కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. చిన్న చిన్న సర్దుబాట్లు చేశామంతే! ‘మన కళ్లు సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో షూట్‌ చేయడానికి అలవాటు పడ్డాయి. అయితే, మొదటి నుంచి ఐమ్యాక్స్‌, సినిమా స్కోప్‌నకు మ్యాచ్‌ అయ్యేలా సీన్స్‌ను ఫ్రేమ్‌ చేయాలనుకున్నాం. సినిమా ప్రొజెక్ట్‌ అయ్యే స్ర్కీన్‌కు అనుగుణంగా ఇమేజ్‌, వీడియో క్వాలిటీ దెబ్బతినకుండా పెద్దదిగా చేసే ప్రక్రియ. అదే అనోమార్ఫిక్‌ ఫ్రేమింగ్‌. దీని వల్ల తొలిరోజుల్లో సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏది ఎలా చేయాలో అవగాహన వచ్చింది. దీంతో పని ఈజీ అయింది’ అని తెలిపారు రాజమౌళి. ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Jun 26 , 2026 | 06:51 PM