సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: ఆ ఇద్దరి మధ్య యుద్ధమే.. 'వారణాసి'! అసలు స్టోరీ.. లీక్ చేసిన రాజమౌళి తండ్రి!

ABN, Publish Date - Jun 07 , 2026 | 07:15 AM

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిట్టుకుంటున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి.

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రూపుదిట్టుకుంటున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కథాంశం గురించి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ఇప్పటికే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇదొక వినూత్నమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కుతోందని, రామాయణ కాలానికి, ప్రస్తుత కలియుగానికి ఉన్న లింకును ఇందులో ఆవిష్కరించబోతున్నారని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది.

భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా ‘వారణాసి’ చిత్రంలో రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే భీకర పోరాటాన్ని మేజర్ హైలైట్‌గా చూపించబోతున్నారు. సాధారణంగా ఇప్పటివరకు వచ్చిన రామాయణ గాథల్లో రాముడు - రావణాసురుడి మధ్య జరిగే క్లైమాక్స్ యుద్ధాన్ని మాత్రమే పీక్స్‌లో చూపిస్తూ వచ్చారు. కానీ ఇందులో రావణ లంకపై రాముడు దండెత్తే క్రమంలో ఎదురయ్యే మరణం అన్నదే లేని, అజేయుడైన కుంభకర్ణుడుతో శ్రీరాముడు తలపడే ఎపిసోడ్ ఏకంగా 30 నిమిషాల పాటు సాగనుందని సమాచారం. రాజమౌళి అసాధారణ విజన్‌తో తెరకెక్కబోయే ఈ యుద్ధ ఘట్టం, ‘ఆర్ఆర్ఆర్’ లోని భీకర పోరాటాల రేంజులో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అత్యుత్తమ దృశ్యకావ్యం కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమా విడుదలయ్యాక కుంభకర్ణుడి పాత్ర గురించి జనాలు గూగుల్‌లో వెతికే రేంజ్‌లో మాస్టర్ స్టోరీ టెల్లర్ ఈ స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారట. ఈ 30 నిమిషాల కుంభకర్ణ - రామ యుద్ధ సన్నివేశాన్ని కనులవిందుగా చూపించడం కోసం చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేస్తోందని ఫిలిం నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క ఫైట్ ఎపిసోడ్ విజువలైజేషన్, హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు దాదాపు 85 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఈ హాలీవుడ్ స్థాయి విజువల్స్, శ్రీరాముడిగా మహేష్ పరాక్రమం తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం ఆ ఒక్క సీన్ గ్రాఫిక్స్ హంగుల కోసమే ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారంటే.. రాజమౌళి ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ఏ రేంజ్ గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ప్లాన్ చేస్తున్నారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ థియరీ స్క్రీన్ పైకి వచ్చింది. ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీలో మలయాళ వెర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకూమారన్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి మనకు ముందే తెలుసు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఫ్యూచరిస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో పృథ్వీరాజ్ పోషిస్తున్న క్యారెక్టర్ పేరును ‘కుంభ’గా పరిచయం చేశారు. అంటే అటు పురాణ కాలంలో కుంభకర్ణుడు, ఇటు భవిష్యత్తు ప్రపంచంలో 'కుంభ' అనే విలన్. ఈ రెండింటికీ మధ్య ఏదో బలమైన, ఆసక్తికరమైన లింక్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే రామాయణంలో కుంభకర్ణుడి కంటే పవర్‌ఫుల్ విలన్ రావణాసురుడు ఉన్నట్లే, ఈ సినిమాలో కూడా ఈ ‘కుంభ’ అనే పాత్ర కంటే వెనుక ఉండి నడిపించే మరో మైండ్ బ్లోయింగ్ సూపర్ విలన్ ఎవరైనా ఉంటారా? అనే కొత్త అనుమానాలు, ప్రశ్నలు ఇపుడు సినీ సర్కిల్స్‌లో రేకెత్తుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆ మెయిన్ విలన్ పాత్రను రాజమౌళి ఎవరితో చేయించబోతున్నారు? అనే ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఇప్పట్నుంచే నెలకుంది.

Updated Date - Jun 07 , 2026 | 07:30 AM