పెద్దమ్మా.. ఈ రేంజ్ మేకోవర్ ఊహించలేదమ్మా
ABN, Publish Date - Aug 24 , 2026 | 03:23 PM
తమిళ చిత్రం కాంచి ద్వారా వెండితెరకు పరిచయమై, ఆ తర్వాత విశాల్ హీరోగా వచ్చిన తిమిరు చిత్రంలో ఈశ్వరి అనే విలక్షణమైన, నెగెటివ్ షేడ్స్ ఉన్న మాస్ పాత్రతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి శ్రియా రెడ్డి.
తమిళ చిత్రం కాంచి ద్వారా వెండితెరకు పరిచయమై, ఆ తర్వాత విశాల్ హీరోగా వచ్చిన తిమిరు చిత్రంలో ఈశ్వరి అనే విలక్షణమైన, నెగెటివ్ షేడ్స్ ఉన్న మాస్ పాత్రతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి శ్రియా రెడ్డి (Sriya Reddy). ఇదే సినిమా తెలుగులో పొగరు పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తన గంభీరమైన గొంతు, ఇంటెన్స్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. విశాల్ అన్ననే వివాహం చేసుకొని వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.
అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రియా రెడ్డి ఎంచుకుంటున్న పాత్రలు భారతీయ సినీ రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. సుడల్ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన శ్రియా మంచి మంచి కథలను ఎంచుకుంటూ వస్తుంది. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన సలార్ చిత్రంలో రాధా రమగా ఆమె చూపించిన రాయల్ అండ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ OG వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లోనూ అత్యంత బలమైన పాత్రలను దక్కించుకుంటూ తన రీఎంట్రీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
తాజాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగమైన మహాకాళి చిత్రం నుంచి వెలువడిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో శ్రియా రెడ్డి పెద్దమ్మ తల్లి మహాకాళిగా దర్శనమిచ్చింది. ఆమె చూపించిన మేకోవర్ నెటిజన్లను, అభిమానులను మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె స్వయంగా శ్రీ మహాకాళి దేవి (కాళికాదేవి ఉగ్రరూపం) అవతారంలో కనిపించి సంచలనం సృష్టించింది. భయంకరమైన రౌద్రంతో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెద్దమ్మ చూస్తోందిరా అంటూ ఇచ్చిన క్యాప్షన్ అదిరిపోయింది.నిజంగా ఆ లుక్ లో పెద్దమ్మ తల్లిని చూసి భయమేస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి పవర్‌ఫుల్ దేవత పాత్రలో శ్రియా రెడ్డిని ఊహించలేదని, ఆమె రీఎంట్రీ ఇండస్ట్రీలోనే అత్యంత పవర్‌ఫుల్ కంబ్యాక్ అని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.